ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ఎవరికైనా అనుమానం వస్తే అందులో తప్పేమీ లేదు . జగన్ మూక దాడులు చేస్తే..లా ఉన్నట్లు. మర్డర్లు చేస్తే ఆర్డర్ ఉన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద .. అరవై, డెభ్బైమంది వీరంగం సృష్టిస్తే ఒక్క పోలీసు అడ్డుకోలేదు. ఒక్క కేసు పెట్టలేదు. పోలీసులు అలా చూస్తూండిపోయారు. పోలీసులకు ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు ఇచ్చి..ఖాకీ డ్రెస్ ఇచ్చేది అందుకేనా ?
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అదే పరిస్థితి. డీజీపీ ఆఫీసు పక్కన ఉండే టీడీపీ ఆఫీసు పై దాడి చేస్తే కేసులు పెట్టలేదంటే పోలీసు వ్యవస్థ పని చేసిందనుకోవాలా ? మాచర్లలో నడిరోడ్డుపై ఇద్దరు ప్రజాప్రతినిధులపై హత్యాయత్నం చేస్తే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారంటే ఏనునుకోవాలి ? ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు జరిగిన బాథితులపైనే కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. అలాంటి అరాచక వ్యవస్థ ఇప్పుడు మరింత బరి తెగించింది. మూకలకు.. పవర్స్ ఇచ్చేసింది. వారికి ఇష్టమైనప్పుడు ఎగబడి దాడులు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చూసీ చూడనట్లుగా ఉండమని నోటి మాట ద్వారా చెప్పినా.. శాంతిభద్రతల విషయంలో రాజీపడకూడదని పోలీసులకు నియమాలు ఉన్నాయి. ఓ ముఖ్యమంత్రి అలా చెప్పకూడదు. కానీ అలాంటి రోజులు పోయాయికాబట్టి పోలీసులపై ఇంకా గురుతర బాధ్యత ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా.. ప్రజల్ని ఇలా అల్లరి మూకలకు వదిలేసి స్వామి భక్తి ప్రదర్శించుకుంటే.. ఉద్యోగంలో చేరేటప్పుడు తాము చేసే ప్రమాణానికి.. విలువ ఏముంటుంది ?