ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, అంచనాలకు భిన్నంగా కేబినెట్ కూర్పులో చంద్రబాబు మార్క్ చూపించారు. ఈ మంత్రివర్గంలో జనసేనకు మూడు, బీజేపీకి ఓ మంత్రి పదవి కేటాయించారు. ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తోపాటు కందుల దుర్గేష్ కు అవకాశం దక్కగా… బీజేపీ నుంచి అనూహ్యంగా సత్య కుమార్ కు బెర్త్ ఖరారు అయింది. టీడీపీ నుంచి ఇరవై మందికి అవకాశం దక్కగా సీనియర్లతోపాటు మొదటిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ లో అవకాశం కల్పించారు. అయితేమంత్రివర్గంలో తప్పక అవకాశం ఉంటుందని భావించినా సీనియర్ నేతలు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, కిమిడి కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య ,కాల్వ శ్రీనివాసులు, కూన రవికుమార్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, కొణతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాసరావు లకు నిరాశ ఎదురైంది. కానీ, ఈ కేబినెట్ లో సీనియర్లు, జూనియర్లతో చంద్రబాబు తన మార్క్ ను చూపించారు.
చంద్రబాబు మంత్రివర్గం ఇదే
1.నారా చంద్రబాబు నాయుడు – ముఖ్యమంత్రి
2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
4. కొల్లు రవీంద్ర (టీడీపీ)
5. నాదెండ్ల మనోహర్ (జనసేన)
6. పి.నారాయణ (టీడీపీ)
7. వంగలపూడి అనిత (టీడీపీ)
8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
9. నిమ్మల రామానాయుడు (టీడీపీ)
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (టీడీపీ)
11. ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ)
12. పయ్యావుల కేశవ్ (టీడీపీ)
13. అనగాని సత్యప్రసాద్ (టీడీపీ)
14. కొలుసు పార్థసారధి (టీడీపీ)
15. డోలా బాల వీరాంజనేయస్వామి (టీడీపీ)
16. గొట్టిపాటి రవి (టీడీపీ)
17. కందుల దుర్గేష్ (జనసేన)
18. గుమ్మడి సంధ్యారాణి (టీడీపీ)
19. బీసీ జనార్దన్ రెడ్డి (టీడీపీ)
20. టీజీ భరత్ (టీడీపీ)
21. ఎస్.సవిత (టీడీపీ)
22. వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)
23. కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (టీడీపీ)
25. నారా లోకేష్ (టీడీపీ)