ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంచెందారు. దుబాయ్ ఎక్స్పోలో ఏపీ పెవిలియన్ బాధ్యతలు చూసుకుని పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని హైదరాబాద్ వచ్చిన కాసేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకు వచ్చే టప్పటికే ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
మేకపాటి గౌతంరెడ్డి వయసు యాభై ఏళ్లు మాత్రమే. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు. ఆయన వరాసుడిగా 2014లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ గెలిచి మంత్రి పదవి చేపట్టారు. అయనకు గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉన్న యువ మంత్రులలో గౌతంరెడ్డి ఒకరు. గౌతంరెడ్డి ఇతర వైసీపీ నేతల కంటే భిన్నంగా ఉంటారు. ఎక్కడా ఎవర్నీ పరుషంగా నిందించినట్లుగా ఉండదు. ఆయన భిన్నమైన రాజకీయాలు చేస్తారు. ఏపీ మంత్రుల్లో ఆయన శైలి భిన్నం.
ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే కావడంతో అత్యవసర వైద్యం అందిస్తే కోలుకుంటారని అనుకున్నారు. తంరెడ్డి ఫిట్నెస్పై ఎంతో ఆసక్తితో ఉంటారు. జిమ్ చేయని రోజూ దాదాపుగా ఉండదని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారని.. ఆ పరిణామాల వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.