ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెషన్ లో మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరితోపాటు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
ప్రధానంగా ఎన్డీయే 100రోజుల పాలన, ఎమ్మెల్యేలు , మంత్రుల పనితీరుపై శాసనసభా పక్ష సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఏపీ ఎన్డీయే అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఎన్డీయే వంద రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20నుంచి 26వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్ళేలా కార్యాచరణ చేపట్టేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ వివరించేలా రోడ్ మ్యాప్ రూపొందించనున్నట్లు సమాచారం.
కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.