ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాక్సిన్లను సమీకరించే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధానంగా వ్యాక్సిన్ల అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ సీఎంలు పెద్ద ఎక్కున వ్యాక్సిన్ల ఆర్డర్ పెట్టారని.. కానీ సీఎం మాత్రం కేవలం రూ. 45 కోట్లు వెచ్చించి.. పదమూడు లక్షల డోసులు మాత్రమే కొంటున్నారని ఆరోపించరాు. ఇంత కొద్ది మొత్తం వ్యాక్సిన్లతో ప్రజల్ని ఎలా రక్షిస్తారని ఆయన మండిపడుతున్నారు. ఈ అంశంపై బుధవారమే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు కానీ.. అసలు విషయం చెప్పలేదు. తామెన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టిందో చెప్పలేదు కానీ.. అసలు వ్యాక్సిన్లన్నీ కేంద్రం అధీనంలో ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఈ వివాదంలోకి విజయసాయిరెడ్డి దూసుకొచ్చారు. ఏపీ పెద్ద ఎత్తున అంటే.. నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టిందని కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చిన కథనాలను.. పోస్ట్ చేస్తూ.. చంద్రబాబుపై అసభ్యకరమైన లాంగ్వేజ్‌తో ట్వీట్ చేశారు. అయితే ఆయనపై నెటిజన్లు ఒక్క సారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉండి.. పత్రికా ప్రకటలను పోస్ట్ చేయడం ఏమిటని… వెంటనే.. గవర్నర్ .. ఆయా వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ పత్రాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఏపీ సర్కార్ వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తోందని.. కేంద్రం ఇచ్చినవి మాత్రం వేస్తే సరిపోతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వ్యాక్సిన్ ధరలు ఎక్కువగా ఉండటంతో .. కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. అయితే అందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించినందున.. రూ. పదహారు వందల కోట్లు ఖర్చు పెడతామని చెప్పినందున.. తక్షణం ఆర్డర్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వెంటనే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి.. ప్రాణాలు నిలబెట్టాలనే డిమాండ్‌తో ” వ్యాక్సిన్ సరఫరా చేయండి- ప్రాణాలు కాపాడండి” పేరుతో ఆందోళనలకు చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఏపీ సర్కార్ అధికారికంగా ఎన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిందో చెబితే కానీ.. ఈ వివాదానికి తెరపడేలా లేదు.