దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి వెళ్లింది. అదీ కూడా ఎవరూ అందుకోనంత రేంజ్‌కి. అది పెట్రోల్, డీజిల్ ధరల విషయం. ఓ వైపు ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించి .. ఆ నిధుల కోసం… పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. పదిహేను వరకు వడ్డించేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సర్కార్ కూడా.. తమ సంక్షేమ పథకాలకు.. ఆ పెట్రోల్, డీజిల్‌నే మండించి పంట పండించుకుంటోంది. ఇప్పటికే సెంట్రల్ , స్టేట్ టాక్సులు… దానికి కలిపి అదనంగా నాలుగు రూపాయల పన్ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. తాగా మరో రూపాయి సెస్. మొత్తంగా లెక్కలు చూస్తే.. ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్ వంటి మహానగరాల కన్నా… గుంటూరులోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ.
ప్రస్తుతం ఆంధ్రలో పెట్రోల్ ధర దగ్గర దగ్గర రూ. 88కి చేరింది. తెలంగాణతో పోలిస్తే.. దాదాపుగా ఒక్క లీటర్‌గా నాలుగు రూపాయలు ఎక్కువ. ఇక ప్రజా రవాణా ఎక్కుగా డీజిల్ వాహనాల ద్వారా నడుస్తుంది. ఇది కూడా మూడు రూపాయల తేడా ఉంది. ప్రస్తుతం ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ. 85వరకూ ఉంది. పొరుగు రాష్ట్రాల ధరలతో పోలిస్తే.. లీటర్‌కు కనీసం మూడు నుంచి నాలుగు రూపాయల తేడా కనిపిస్తోంది. తెలంగాణ , కర్ణాటక, తెలంగాణ, యానాంలో కూడా ధరలు తక్కువే. దీంతో సమీపంలో ఉండే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వచ్చే పరిస్థితి ఉంది. మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు వినియోగదారులు.
వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ ఉత్పత్తులపై అదనపు వ్యాట్ లీటర్‌కు రూ.2 మాత్రమే ఉండేది. సంక్షేమ పథకాల సాకుతో ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి లీటర్‌పై రూ.4 చేసింది. ఇప్పుడు సెస్ విధించారు. ఇంతటితో అయిపోలేదు.. ప్రభుత్వం ప్రతి కొత్త పథకం అమలు చేసినప్పుడల్లా… పన్నులు పెంచుతూ వస్తోంది. ఇతర పన్నుల సంగతేమో కానీ.. ఏపీ సర్కార్‌కు ముందుగా పెట్రోల్, డిజిల్ మాత్రమే కనిపిస్తున్నాయి. దాంతో… పెంచేస్తున్నారు. ఇంకా ఏ రేంజ్‌కి తీసుకెళ్తారో చెప్పడం కష్టం.