విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం చిన్న అవకాశాలను కూడా వదులుకోవాలనుకోవడం లేదు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఈ విషయంలో చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లుగా పని చేస్తున్నారు. ఏపీ అవకాశాల్ని ఎప్పటికప్పుడు వివరించి.. విదేశీకంపెనీల పెట్టుబడుల ప్రణాళికల్లో ఏపీ ఎప్పుడూ ఉండేలా చేసేందుకు వినూత్నమైన ఆలోచనలో ముందుకు వస్తున్నారు. పలు దేశాల్లో ఆంధ్రప్రదేశ్ కార్యాయాలను ప్రారంభించాలని అనుకుంటున్నారు.
అమెరికా, జపాన్, బ్రిటన్ తో పాటు భారత్ తో మంచి పారిశ్రామిక అనుబంధం ఉన్న దేశాల్లో ఏపీ ఆఫీసులు ప్రారంభించనున్నారు. అలా చేయడంవల్ల పెట్టుబడుల విషయంలో పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి విషయంలో అయినా అందుబాటులో ఉన్నట్లుగా ఉంటుంది.. వారికి కూడా ప్రభుత్వం దగ్గరగా ఉందన్న భావన ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి నిర్ణయంల తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
విభజన తర్వాత పారిశ్రామికంగా వెనుకబడిన ఏపీని.. పరిశ్రమల కేంద్రం చేయడానికి ఐదేళ్ల పాటు విస్తృత ప్రయత్నాలు జరిగాయి. కియా లాంటి అతి భారీ ఎఫ్డీఐ వచ్చింది. ఇంకా అనేక పరిశ్రమలు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. పారిశ్రామిక ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఏపీ మారింది. కానీ గత ఐదేళ్లలో జరిగిన ఘోరాలు … మొత్తానికే నాశనం చేశాయి. ఇప్పుడు మళ్లీ పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది.