ఏపీలో పోలీసులు సోషల్ కీచకుల పని పడుతున్నారు. భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో అందరికీ రంకులు అంటగడుతూ.. మార్ఫింగులు వేస్తున్న ప్రతి ఒక్కరి తాట తీసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఇలాంటి కీచకుల్ని అరెస్టు లు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అదే పని చేస్తున్న ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్లను కూడా అరెస్టు చేస్తున్నారు. సీరియల్ అఫెన్సర్ కింద అరెస్టులు చేస్తూండటంతో బెయిల్ రావడం కూడా కష్టమని భావిస్తున్నారు.
వీరంతా వైసీపీ పే రోల్స్ లో ఉన్న వాళ్లే. గతంలో హైకోర్టు న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడినవారే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు వారు మారుతారేమో అని ఎదురు చూశారు. కానీ ఆలా ఎదురు చూడటం అంటే వాళ్లకు అలుసు ఇచ్చినట్లే అనుకున్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఉంటున్నారని వాళ్లను ఏమైనా చేయవచ్చని రెచ్చిపోయారు. చివరికి హోంమంత్రి అనిత మీద కూడా మార్పింగులు వేస్తున్నారు. ఇప్పుడు పాపం పండటంతో ఒక్కొక్కరి సంగతి చూస్తున్నారు.
ఈ సోషల్ మీడియా కీచకులకు అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ అరెస్టులు చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా వారి కోసం పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్లుగా కనిపించడం లేదు. కాస్త పలుకుబడి ఉన్న వారి కోసం వస్తున్నారు కానీ ఎన్ని సార్లు అని పూచికత్తు ఇస్తామని.. పదే పదే అలాంటి పనులు చేస్తే ఎలా అని పార్టీ ముఖ్య నేతలు కూడా సైడైపోతున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో మహిళల్ని కించ పరిచే వారిపై పోలీసులు ఉక్కుపాదంమోపడం ప్రారంభించారు.