ఏపీ డీజీపీ పేరుతో ఉన్న ఓ వెరీఫైడ్ ఖాతా .. ఫేక్ అని పోలీసులు ప్రకటించారు. ఎప్పుడో మూడేళ్ల కిందటే అది క్రియేట్ అయిందని కానీ వాడటం లేదన్నారు. ఇప్పుడు ఎవరో హ్యాక్ చేసి.. అసభ్య వీడియోలకు లైకులు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. నిజానికి అది ఫేక్ అని మూడేళ్ల కిందటనే తెలిస్తే పోలీసులు చేస్తున్నారనేది అందరికీ వచ్చే డౌట్. ఇప్పుడు మళ్లీ హ్యాక్ చేశారని అంటున్నారు. అసలు ఫేక్ అయితే.. హ్యాక్ చేయడం ఏమిటనేది పోీలసులకే తెలియాలి. ఫేక్ అయితే దాన్ని సృష్టించిన వ్యక్తే వాడుతూండవచ్చు.. హ్యాక్ అయిందని పోలీసులకు ఎలా తెలుస్తుంది.
నిజానికి ఇలాంటిదేదైనా జరిగితే వెంటనే … సాక్ష్యాలతో సహా పట్టుకుని ఇదిగో.. ఈ వ్యక్తి చేశాడు అని మీడియా ముందు ప్రవేశ పెట్టి.. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకుంటారు కానీ.. ఫేక్, హ్యాక్ అంటూ కబుర్లు చెప్పి… దర్యాప్తు చేస్తున్నామని కవర్ చేసుకుంటే… ప్రజలు సమ్ ధింగ్ ఫిషీ అనుకునే ప్రమాదం ఉంది. అలా అనుకుంటే.. ఎవరికి నష్టం.. ? డీజీపీ పేరుతో ఉన్న ఉన్న ఖాతాల నకిలీనో కాదో.. పోలీసులు తేల్చి బయట పెట్టాలి. నకలీ అయితే ఎలా వెరీఫై అయిందో కూడా తేల్చి ప్రజలకు చెప్పాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు పేరుతో టైం పాస్ చేస్తే… ఈ నిర్వాకం అంతా పోలీసులది.. వారి బాస్ దేనని అనుకునే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా పోలీసులు వేగంగా స్పందించి.. డౌట్లు క్లారిఫై చేయాల్సి ఉంది.