వైసీపీ సోషల్ మీడియాకు సినిమా మెల్లగా అర్థమవుతోంది. ఇప్పుడు సోషల్ సైకోల్ని పట్టుకుని పోలీసులు తాట తీస్తున్నారు. వైసీపీ ఆఫీసులో రోజంతా లైట్లు వెలిగి ఉంటున్నాయి. లాయర్లు ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ… పోలీసులు కొట్టకుండా అయ్యప్ప స్వామి మాలలు వేసుకోండి.. దొరకకుండా ఫలానా విధంగా తప్పించుకోండి.. అని సలహాలిస్తున్నారు. పోనీ ప్రజల నుంచి అయినా కాస్త సానుభూతి వస్తుందా అంటే.. అలాంటివారిని వదిలేస్తే ఇప్పుడు సోషల్ మీడియా రేపు బయట అకృత్యాలకు పాల్పడతారని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక.. నర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ రెడ్డి వంటి వాళ్లకు ఇన్ స్టంట్ ట్రీట్మెంట్ ఉంటుందని అనుకున్నారు. కానీ వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి పంపేశారు. దీంతో టీడీపీ క్యాడర్ లో అసహనం కనిపించింది. నాలుగు నెలల పాటు ఇలాగే జరిగింది. దీంతో ఇది టీడీపీ ప్రభుత్వం చేతకానితనమని…. ఇక తమకు అడ్డుఅదుపూ లేదనుకున్నారు. అందరూ బయటకు వచ్చారు. సరైన సమయం చూసి ఏపీ ప్రభుత్వం పంజా విసిరింది. ఇప్పుడు ఏ టు జడ్ దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా.
అంటే ఒకరిద్దర్ని జైలుకు పంపి మిగతా వారికి వియ్ స్టాండ్ పోస్టులు వేసే అవకాశం ఇవ్వలేదు. అందర్నీ ఒకే సారి లోపలేస్తున్నారు. దానికి తగ్గ సాక్ష్యాలను వారే ఇచ్చారు. కొంత మందిపై పోక్సో చట్టం ప్రకారం కూడా కేసులు పెట్టబోతున్నారు. ఆవేశంతో చేసే అరాచకానికి.. ఆలోచనతో చేసే రాజకీయానికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమవుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.