కొడాలి నాని ముఖ్య అనుచరుడు అస్సాం పారిపోయాడు. బస్సు అస్సాం అయిపోయినా వదిలేది లేదని గుడివాడ పోలీసులు చార్జీలు పెట్టుకుని మరీ వెళ్లి అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆయన పేరు మెరుగుమాల కాళీ. గడ్డం గ్యాంగ్ పేరుతో గుడివాడలో చేయని అరాచకాలు లేవు. ఎంత మందిని దోచుకున్నారో ఎంత మంది మరణానికి కారణమయ్యారో చెప్పాల్సిన పని లేదు. రావి వెంకటేశ్వరరావు వ్యాపార సముదాయంపై ఎన్నికలకు ముందు పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనలో కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో పది మందికిపైగా ఇంతకు ముందు అరెస్టు చేశారు. కాళీ కోసం వెదుకుతున్నారు. టీడీపీ ఓడిపోయి కొడాలి నాని కనిపించకుండా తిరుగుతున్న సమయంలో ఆయన కూడా కనిపించకుండా పోయారు. అందరికీ దూరంగా అస్సాంలో బతుకుతున్నారు. టీడీపీ నేతలు హెచ్చరించినట్లుగా ఆయన బతుకు అస్సాం అయిపోయినా పోలీసులు వదల్లేదు. ఆయనపై నిఘా పెట్టారు. తన గడ్డం గ్యాంగ్ లోకి ఓ వ్యక్తికి ఓ సారి ఫోన్ చేయడంతో పోలీసులు కనిపెట్టారు. సైలెంట్ గా వెళ్లి అరెస్టు చేసుకొచ్చారు.
కొడాలి నానిని గట్టిగా ఫ్రేమ్ చేసే ప్రయ్తనంలోనే ఆయన అనుచరుల్ని ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు చేసింది చిన్న చిన్న క్రైమ్స్ కాదు. తీవ్రమైన నేరాలు. అన్నింటి వెనుక కొడాలి నాని ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసులన్నీ మెల్లగా కొడాలి నాని వద్దకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.