మూడు రోజుల కిందట చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఏపీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్న ఆయన దగ్గరకు కనీసం రెండు బెటాయిలియన్ల పోలీసుల్ని పంపి… అర్థరాత్రి నుంచి సీన్ ప్రారంభించి … తెల్లవారే వరకూ డ్రామా కొనసాగించారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పడానికి పోలీసులు నిరాకరించడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబును ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలని సీఎం జగన్ రెడ్డి కోరికను తీర్చుకునేందుకు ఇలా పోలీసు వ్యవస్థను .. తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శని, ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలన్న లక్ష్యంతో ఈ అరెస్ట్ ప్రయత్నం జరిగింది. ఏ ఒక్కరికీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు. ఉదయం ఐదున్నరకు చంద్రబాబు బస్సులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సేపు పోలీసులతో మాట్లాడారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పేందుకు కూడా నిరాకరించారు. తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ చేసిన తప్పేంటో .. కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏమిటన్న చంద్రబాబు, పోలీసుల అభ్యంతరాలను పట్టించుకోలేదు.
మరో వైపు పోలీసులు అన్ని రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు అసలు అరెస్టు చేస్తున్న వ్యక్తికి ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పకపోవడం హక్కులు ఉల్లంఘించడమే. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తే… మమ్మల్ని చుట్టుముట్టి బెదిరిస్తున్నారని పోలీసులు వితండవాదం వినిపించారు. అయితే మా హక్కుల గురించి ప్రశ్నిస్తే… బెదిరించడం ఎలా అవుతుదని చంద్రబాబు, లాయర్లు ప్రశ్నించారు. అయినా పోలీసులు తాము వచ్చిన లక్ష్యం నెరవేర్చుకున్నారు.