ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారు. రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారని సెక్షన్లు పెట్టారు. వీటికి ఆధాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నిస్తే సోషల్ మీడియా పోస్టును చూపించారు పోలీసులు.
దీంతో నిందితుడిని జైల్లో ఉంచాలనే ఇలాంటి సెక్షన్లు పెట్టారని ఆగ్రహించారు. రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించి.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రికి చెందిన పవన్ ఫణి.. హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాయి. జనసేనపై అభిమానంతో టీడీపీ, వైసీపీపై ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపేస్తానని పోస్టు పెట్టి.. కాసేపటికి తీసేశాడు.
అయితే సీఐడీ అధికారులు మాత్రం వెంటపడి పట్టుకుని రాజద్రోహం.. ప్రభుత్వంపై యుద్ధం కేసులు పెట్టారు. కోర్టుతో చీవాట్లు తిన్నారు. జనసేన పార్టీ కూడా అతన్ని పట్టించుకోలేదు. తమకు సంబంధం లేదని ప్రకటించింది. దీంతో జనసైనికులు కూడా నిరాశకు గురయ్యారు.