రామ్ గోపాల్ వర్మ అంటే చాలామందికి ఇష్టం. కొంతమందికి ఆయన తీసిన సినిమాలు. ఇంకొంతమందికి ఆయన మాట్లాడే మాటలు. ప్రతి విషయాన్ని ఏదో ఒక లాజిక్ తో జస్టిఫై చేస్తుంటారు ఆర్జీవి. ఆ లాజిక్కులు కూడా చాలా వరకూ కన్వెన్సింగ్ గా ఉంటాయి. అందుకే రాంగోపాల్ వర్మ సినిమాలు తీయడం మానేసినప్పటికీ ఆయన నిత్యం యూట్యూబ్, టీవీలో చెప్పే మాటలకి కొందరు ఆకర్షితులు అవుతుంటారు.
అయితే అతనిలో మేధావి ఒక్కసారిగా పడిపోయాడు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసిపి వాకాల్తాపుచ్చుకుని చేసిన కొన్ని కామెంట్లు, ట్వీట్లు సభ్య సమాజం సిగ్గుపడేలా చేశాయి. ఏవో కొన్ని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి జనాలపైకి వదిలారు. వాటిని ఎవరు కూడా పట్టించుకోలేదు. అది వేరే సంగతి. ఆ సినిమాలు ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో ఈసారి తన ట్విట్టర్ కి పని చెప్పారు. నిత్యము ఒక వైసీపీ కార్యకర్తల ఏదో ప్యాకేజీ పుచ్చుకుని పనిచేయాలనే ఉద్దేశంతో తన ట్విట్టర్ హ్యాండిల్ నడిపారు. చివరికి మార్ఫింగ్ ఫోటోలని పోస్ట్ చేసుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. ఏపీలో పాలక పక్షం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోషల్ మీడియా సైకోలని ఏరిపారేయాలనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. అడ్డగోలు ట్వీట్లు, మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి వ్యక్తిత్వ హననానికి దిగిన సోషల్ మీడియా సైకోల భరతం పట్టే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు.
ఇప్పుడు రాంగోపాల్ వర్మ వంతు వచ్చింది. రామ్‌గోపాల్‌వర్మ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు.
నోటీసులు రావడం, కోర్టులకు హాజరవడం, వివాదాలు ఎదుర్కోవడం ఇవేవీ కూడా రాంగోపాల్ వర్మ కు కొత్త కాదు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక లా పాయింట్, లాజిక్ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన నోటీసులు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఈ సంగతి రామ్ గోపాల్ వర్మ కూడా తెలుసు. ఈ విషయంలో ఆయన చాలా ముందు జాగ్రత్త చర్యతోనే ఉన్నాడు.
కూటమి ప్రభుత్వం ఏనాడైతే అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచే గతం మర్చిపోయినట్లు మారిపోయారు రాంగోపాల్ వర్మ. ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి ఒక్క నెగిటివ్ ట్వీట్ కూడా ఆయన అకౌంట్లో ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు సినిమాలు, తన వ్యవహారాలు, అమెరికా ఎలక్షన్లు.. వీటి చూట్టే ఆయన ట్వీట్లు నడుస్తున్నాయి. వెతికి పట్టుకుందామన్నా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక్క నెగిటివ్ కూడా కనిపించదు. ఇది రాంగోపాల్ వర్మ అతి తెలివి, బతకనేర్చిన తనానికి నిదర్శనం.
సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు వచ్చాయి. మార్ఫింగ్ లు, వ్యక్తిత్వహననం, మానసిక హింసకు గురి చేసే వారికి చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తనకు వచ్చిన నోటీసులోని సీరియస్‌నెస్ రాంగోపాల్ వర్మకు తెలుసు. అందుకే కొన్నాళ్లుగా ఆయన ఎకౌంట్ మూగబోయింది. ఆయన పెదవి విప్పడం లేదు. ప్రతిదానికి ఎదో లాజిక్ చెప్పి తప్పించుకునే వర్మ.. నీచమైన మార్ఫ్పింగులని ఎలా సమర్ధించుకుంటారో మరి.