ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో ధ్రిల్లర్ డ్రామాను నడపడంలో అద్భుతమైన విజయం సాధించారు. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. తర్వాత అరెస్ట్ చేశామని లీకులిచ్చారు. ఫైనల్ గా తూచ్.. అనేశారు. పిన్నెల్లి ఎక్కడో సరదాగా చికెన్ ముక్కలు తింటూ టైం పాస్ చేస్తున్నారేమో కానీ..పోలీసులు నడిపిన డ్రామాను చూసి ప్రజలు కూడా రాత్రికి తాము ఇంత అమాయకులమా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద అత్యంత కఠినమైన చట్టాల కింద కేసులు పెట్టామని ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని సీఈవో మీనా చెప్పారు. అంతకు ముందు నుంచే పిన్నెల్లి అరెస్టుకు చేజింగ్ ప్రారంభమయిందని పోలీసులు లీకులు ఇచ్చారు. ఇక అరెస్టు చేస్తారేమో అనుకున్నారు.కానీ ఆయన దొరకలేదు.. పోలీసులు పట్టుకోలేదు. చివరికి ఆయన వీసా అవసరం లేని దేశాలకు పోయి ఉంటాడని పుకారు కూడా లేపారు.
ఐదు గంటల కల్లా అరెస్ట్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించిన సీఈసీని బురిడీ కొట్టించడానికి ఘనత వహించిన పోలీసులు ఇలా నాటకమాడారని ఎవరికైనా అర్థమవుతుంది. పన్నెల్లిని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఆయనేమీ అనామకుడు కాదు. ఎక్కడా దాక్కోలేడు. లుకౌట్ నోటీసులు జారీ చేసినందున విదేశాలకు పోయే చాన్స్ లేదు. కానీ అరెస్టు చేయకూడదని..సీఈసీని కూడా కాదనే వ్యవస్థలు తమ చేతుల్లో ఉన్నాయని నిరూపించుకోవడానికే ఇలా డ్రామా అడారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా.. ఫెయిలయినట్లే.