ఛాతి నొప్పి అంటూ హడావుడి చేసిన పోసాని కృష్ణమురళి తీరుపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. తనకు గుండె జబ్బు ఉందని దానికి టాబ్లెట్లు వాడుతున్నట్లుగా చెబుతున్న ఆయన హఠాత్తుగా సెల్ లో తనకు చాతి నొప్పిగా ఉందని విలవిల్లాడారు. నిజమే అనుకుని పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎందుకైనా మంచిదని కడప రిమ్స్ తీసుకెళ్లి టెస్టులు చేయించారు. అయితే అంతా నార్మల్ గానే ఉందని తేలింది. దీంతో పోసాని డ్రామాలాడారని పోలీసులు మండిపడ్డారు.
రాజంపేట సబ్ జైల్లో పోసాని చాతీ నొప్పి అంటూ తెలిపాడని.. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించామన్నారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజంపేట నుంచి కడప రిమ్స్ కు తరలించి మరోసారి మైరుగైన చికిత్స అందించామన్నారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు..పోసాని డ్రామా ఆడుతున్పాడని .. ఈసిజి తో పాటు రక్త పరీక్షలు నిర్వహించామన్నరాు. రిమ్స్ లో వైద్య పరీక్షలు అనంతరం మళ్ళీ రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని ప్రకటించారు.
కస్టడీకి ఇస్తారేమోనన్న భయంతో బెయిల్ వచ్చేలా చేయడానికి పోసాని తనకు ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను పోలీసుల వద్ద చూపిస్తున్నట్లుగా తెలుస్తోందిం.వైసీపీ తరపున వచ్చిన లాయర్లు కూడా అలాంటి సలహాలు ఇచ్చి ఉంటారని..అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడని భావిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయనకు పూర్తి స్థాయి పరీక్షలతోనే చెక్ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.