ఆంధ్రప్రదేశ్ పోలీసులు్లో వైసీపీ కోసం పని చేసేందుకు ఓ ప్రత్యేకమైన విభాగం ఏర్పటయింది. ఇది రాష్ట్ర స్థాయిలో.. జిల్లా స్థాయిలో కూడా ఉంటుంది. ఈ స్పెషల్ బ్రాంచ్ పనేమిటంటే.. వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా పని చేస్తారో వారిని గుర్తించి కేసులు పెట్టి బొక్కలో వేసి మక్కెలిరగతన్నడం. ఇప్పటికే ఇది నాలుగేళ్లుగా చేస్తున్నారు కానీ.. ఎన్నికలకు ముందు ఇక ఎవర్నీ వదలకూడదని డిసైడయ్యారు.
డీజీపీ రెడ్డిగారు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం చేసి.. ఆయనపైనే హత్యాయత్నం కేసులు పెట్టినా స్పందించరు. నేరాలు ఘోరాలు జరిగినా పట్టించుకోరు. తమ పోలీసుల్ని వైసీపీ నేతలు కుక్కల్ని కొట్టినట్లుగా కొడుతున్నా.. తుడిచేసుకుంటున్నారు. కానీ వైసీపీ కోసం అవసరమైన పనులు చేయడంలో మాత్రం… ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తే తాట తీస్తామని ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
పోలీసుల దృష్టిలో ఫేక్ ప్రచారం అంటే.. వైసీపీకి వ్యతిరకంగా నిజాలు చెప్పడం. నిజాలు చెప్పినా తప్పుడు ప్రచారం అంటూ.. కేసులు పెట్టి బొక్కలో వేయడం.. చితక్కొట్టడం. అదే వైసీపీ నేతలు అయితే.. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. ఎందుకంటే వారికి ఏపీ పోలీసులు అమలు చేసే చట్టం, రాజ్యాంగంలో వెసులుబాటు ఉంటుంది. అత్యంత దారుణంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నా… ఒక్క పోలీసు అధికారికీ అది పట్టదు. అదే వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల్ని చెబితే మాత్రం రోషం ముంచుకొస్తోంది.
ఎప్పుడైతే పోలీసులు ప్రజల్ని సమదృష్టితో చూడకుండా… ఓ వర్గం కోసం పని చేయడం ప్రారంభిస్తారో అప్పుడే ఆ రాష్ట్రం పతనం ప్రారంభమైనట్లు. ఏపీలో ఇదే జరుగుతోంది. ఎన్నికల్లోపు ఇంకా ఎంత జరుగుతందో చెప్పలేం .. కానీ ఈ పతనాన్ని ఎవరో వచ్చి బాగుచేయలేరు. బాధలు పడిన వారికి అధికారం వస్తే అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటారు. దాని వల్ల పరిస్థితులు దిగజారిపోతాయి తప్ప.. ఎవరికీ లాభం ఉండదు. దీన్ని ప్రారంభించిన వారే బాధ్యులు. వారు పోలీసులే అవుతారు.