ఏపీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బూతుల మాఫియా లీడర్ ను పూర్తి స్థాయిలో నిందితుడిగా మార్చేందుకే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ..పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయం క్లారిటీకి వస్తుంది. తాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి.. ఏం మాట్లాడాలన్నదానిపై ప్రతీ సమాచారం తనకు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వస్తుందని పోసాని కృష్ణమురళి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇదే ఎఫెక్ట్ ఇతర కేసుల్లోనూ కనిపించింది. తాము మాట్లాడినవి..తిట్టినవి అన్నీ తమ సొంతం కాదని సజ్జల నుంచి వచ్చిందేనని అనేక మంది చెప్పారు. ఇప్పుడు పోసాని చెప్పారు.
వైసీపీ టార్గెట్ పెట్టుకుని మరీ బూతుల మఫియాను పెంచి పోషించిందని అందరికీ తెలుసు. వ్యవస్థీకృతం గా జరిగిన ఈ నేరాన్ని నిరూపించాలంటే అందులో భాగమైన అప్రూవర్లుగా మార్చాలి. ఇప్పుడు పోలీసులు అదే చేస్తున్నారు. ఇంత బతుకు బతికి.. బూతుల మాఫియాలో భాగమై ఇప్పుడుజైలు పాలవుతున్నందుకు వారంతా ఫీల్ అవుతున్నారు. పోసాని సినీ రంగంలో చాలా సాధించారు. కానీ ఎప్పుడైతే ఇతరులపై ద్వేషంతో వైసీపీ వలలో చిక్కారో అప్పుడే ఆయన పతనం ప్రారంభమయింది. సజ్జల రెచ్చిపొమ్మన్నట్లుగా రెచ్చిపోయారు. కులాల మధ్య కుంపటి పెట్టడానికి కూడా వెనుకాడలేదు.
రేపటి రోజున ఆర్జీవీకీ ఈ పరిస్థితి తప్పకపోవచ్చు. ఆయన కూడా సొంతంగా పోస్టులు పెట్టి ఉండరు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను కొంతమంది ఉపయోగించారు. ఆ కొంతమంది ఎవరో కాదు.. సజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారేనని ఇప్పటికే పోలీసులకు ఆధారాల లభించాయి. అలా ఆ హ్యాండిల్ ఇచ్చినందుకో.. ఆయనకు కంటెంట్ ఇచ్చి పోస్టులు పెట్టించినందుకో.. ఫైబర్ నెట్ నుంచి కోట్లు తీసుకున్నారు. ఆ లెక్క కూడా బయటపడింది. విచారణకు హాజరు కాని ఆయనను ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉంది.
బూతుల మాఫియాలో భాగం అయిన వారు ఇప్పుడు అరెస్టు అవుతున్నారు. వారిని మాత్రమే అరెస్టు చేయాలని టార్గెట్ గా పెట్టుకోలేదు. అసలు లీడర్ వరకూ వెళ్లి .. ఆ వ్యవస్థీకృత మాఫియా లీడర్ని బోనులో.. ప్రజల ముందు నిలబెట్టే వరకూ ఈ అరెస్టులు సాగే అవకాశం ఉంది.