ఏ కేసులో అరెస్టు చేస్తున్నామో చంద్రబాబుకు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. ఓ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నామని సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో అన్ని వివరాలు ఇస్తామని వాదించారు. అయితే నీలి, కూలి మీడియాలో మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ప్రచారం ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా రోజులుగా విచారణ జరుపుతున్నారు. ఇంత వరకూ విచారణలో అవినీతి జరిగిందని తేల్చలేదు. కానీ కోర్టుకు చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పామని అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
నీలి, కూలి మీడియాలో మాత్రం మాత్రం తప్పుడు ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. అచ్చెన్నాయుడును ఈఎఎస్ఐ స్కాం పేరుతో అరెస్ట్ చేసి…. ఒక్క రూపాయి అవినీతిని కూడా చూపించలేకపోయారు. కానీ ఆయనను చాలా రోజులు జైల్లో ఉంచారు. ఆకేసులో ఇప్పటికీ చార్జిషీట్ వేయలేదు. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఏకేసులోనూ ప్రాథమిక ఆధారాలు చూపించలేదు. అర్థరాత్రి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మొత్తం డీటైల్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అసలు ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉండదు. బాధ్యుడ్ని చేయలేరు అని స్పష్టంగా లాయర్లకు తెలుసు. తన పేరు కనీసం ఎఫ్ఐఆర్లో చూపించాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేరు.
మీడియాలో రెండు రోజుల పాటు తప్పుడు ప్రచారాలతో హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఐటీ నోటీసులకే… మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేశారు. ఇప్పుడు స్కిల్ కేసులో కొత్తగా ఏదో ఉన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. కోర్టుకు సెలవులు చూసుకుని రెండు రోజులు జైల్లో పెట్టవచ్చన్న ఓ లక్ష్యంతోనే ఈ పని చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రెండు రోజులు కావాల్సినంత తప్పుడు ప్రచారాలు చేసుకుంటారు. వారి లక్ష్యం ఇదే.
ఓ కేసులో అరెస్ట్ చేయాలంటే ముందుగా … కనీసం నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారు. మాజీ ముఖ్యమంత్రి ని అరెస్టు చేసేటప్పుడు కనీసం చట్ట నిబంధనలు పాటిస్తారు. కానీ ఏపీ పోలీసులు వాటన్నింటికీ విరుద్ధం.