ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న లోపాలను లాయర్లు విశదీకరిస్తూంటే జనానికి మైండ్ బ్లాంక్ అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు చేస్తున్నప్రకటనలు ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని అంగీకిరిస్తున్నట్లుగా ఇప్పుడు అమలు చేయడం లేదని చెబుతున్నారు. కొంత మంది ఇలా చెబుతూంటే.. కొంతమంది అమలవుతోందని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారు జగన్ వెనక్కి తగ్గబోరని చట్టం అమలు చేసి తీరుతారని మరింతగా భయపెడుతున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పేరుతో టీడీపీ చేస్తున్న ప్రచారం ట్రాప్ లో వైసీపీ నేతలంతా పడిపోయారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. మరింతగా భయపెడుతున్నారు. ఇది సమస్యగా మారుతోంది.
గ్రామాల్లో ఎన్ని భూ సమస్యలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ భూసమస్యలను అడ్డంపెట్టుకుని తమ ఆస్తుల్ని వైసీపీ నేతలు లాగేసుకుంటారన్న భయంతో ఎక్కువ మంది ఉన్నారు. రెడ్డి … క్రిస్టియన్ అనే తేడాలేకుండా అందరిలోనూ అదే భయం కనిపిస్తోంది. దీన్ని వైసీపీ నేతలు మరింత పెంచుకుంటున్నారు తప్ప.. ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. తీసేస్తామంటే.. తప్పుడు చట్టం తెచ్చినట్లే కదా అని అంటారు… ఉంచుతామంటే.. భూములు కొల్లగొడతారా అని విమర్శిస్తారు. ఎలా చూసినా.. వైసీపీకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెను సమస్యగా మారింది.