తెలుగు రాష్ట్రాల్లో యాధృచ్చికమైన రెండు ఘటనలు.. ఒకేసారి చోటు చేసుకున్నాయి. ఒకటి నిర్మాణానికి శంకుస్థాపన కాగా.. మరోకటి… అక్రమ కట్టడం కూల్చివేత. హైదరాబాద్లో… కొత్త సచివాలయానికి.. కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అమరావతిలో… ప్రజావేదికభవనం కూల్చివేత పూర్తయింది. అక్కడ ఉన్న శిధిలాలను తొలగించే ప్రక్రియ.. రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
ఏడాదిలో తెలంగాణకు కొత్త సెక్రటేరియట్..!
కొత్త సెక్రటేరియట్,అసెంబ్లీ భవనాలకు ముఖ్యమంత్రి కేేసీఆర్ శంఖుస్థాపన చేశారు. సెక్రటేరియట్ కొత్త భవనాల కోసం డి బ్లాకు ముందు భూమి పూజ చేశారు. ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి కార్యాలయంలో కొత్త అసెంబ్లీ భవనాల భూమి పూజ నిర్వహించారు. కొత్త సెక్రటేరియట్,అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం వేగంగా పనులు నిర్వహిస్తోంది తెలంగాణా ప్రభుత్వం. వాస్తు నిపుణులు సూచించిన విధంగా డి బ్లాకు ఉత్తర ద్వారం ముందున్న స్థలంలో శంఖుస్థాపన నిర్వహించారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పుడున్న అన్ని భవనాలను కూల్చి వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏపీకి కేటాయించి.. తిరిగి తీసుకున్న భవనాలను కూడా కూల్చి.. విశాలంగా నిర్మించబోతున్నారు.
ఏపీలో ప్రజావేదిక కూలింది..! వాట్ నెక్ట్స్..?
ఓ వైపు.. తెలంగాణలో.. అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేసిన సమయంలోనే.. అమరావతిలో ప్రజావేదిక భవనం కూల్చివేత పూర్తయింది. శిధిలాలను మాత్రం తొలగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోయిన తర్వాత .. ఏపీ సర్కార్.. అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి.. యుద్ధప్రాతిపదికన నిర్మించిన కట్టడం ప్రజావేదిక. ఇప్పుడు దాన్ని కూడా కూల్చివేయడంతో.. ఇక ఏ కార్యక్రమాలు జరగాలన్ని.. పంక్షన్ హాళ్లు.. హోటళ్లలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరో చోట.. ప్రజావేదిక లాంటి నిర్మాణాన్ని చేయాలనుకుంటున్నారు. అయితే.. అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.