తమిళనాడుకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక వ్యక్తిగా ఉన్న సరిన్ పరాపకరత్ అనే ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు ఆ రాష్ట్రానికి గుడ్ బై చెప్పి ఏపీకి వచ్చారు. ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సరిన్ను నియమించారు. తమిళనాడు ప్రభుత్వంలో చాలా కాలంగా పని చేస్తున్న సరిన్.. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ముందు ఏపీ టీంలో చేరడం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సరిన్ బడా పారిశ్రామికవేత్తలతో నిత్యం టచ్ లో ఉండే ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడు. ఆయన ఏపీతో కలిసి పని చేసేలా నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రయత్నించి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి రావడంలో సరిన్ పాత్ర ప్రముఖమని అక్కడి ఇండస్ట్రీ నిపుణులు చెబుతారు. ఆయన తమిళనాడును వదిలి పెట్టడంపై వారు ఆశ్చర్యపోతున్నారు ఏం జరిగిందో కానీ..ఏపీకి మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటున్నారు.
దావోస్ సదస్సుకు సరిన్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏపీతో కలిసి వచ్చే పదేళ్లు పని చేస్తే.. మల్టీనేషనల్ కంపెనీల ను ఏపీకి రప్పించడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి సరిన్ రాక.. మరింత బలం చేకూర్చుతుందని అంచనా వేస్తున్నారు.