జాతీయ మీడియాలో టైమ్స్ గ్రూప్‌కు ఏపీ ప్రజల సొమ్ము వందల కోట్లు ముట్టాయి. ఏపీ నేతల ఇమేజ్ పెంచడానికి అంటూ రూ. ఎనిమిదిన్నర కోట్ల ఒప్పందాన్ని మొదటి ఏడాదే చేసుకున్నారు. ఆ ఇమేజ్ పెంపు కోసం ఏం చేశారో తెలియదు . ఇటీవల విశాఖలో నిర్వహించిన ఇనెస్టర్స్ సమ్మిట్ బాధ్యత మొత్తం టైమ్స్ గ్రూప్‌కే ఇచ్చారు. టైమ్స్ గ్రూప్‌లోని టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు అప్పగించారు. టెండర్లు పిలిచారా లేదా అన్న సంగతి ఎవరికీ తెలియదు.. . కానీ వారి పంట పండింది. సదస్సు నిర్వహణకు మొత్తం రూ. 170 కోట్ల వరకూ ఖర్చయినట్లుగా చెబుతున్నారు ఇందులో టైమ్స్ వాటా రూ. వంద కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
టైమ్స్ నెట్ వర్క్ మీడియా సంస్థే అయినప్పటికీ ఇలాంటి ఈవెంట్స్ ను కూడా నిర్వహిస్తుంది. ఆ గ్రూపులో ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజెంట్ కంపెనీ కూడా ఉంది. ప్రభుత్వాలు ఇలాంటి ఈవెంట్ లను టైమ్స్ కు ఇస్తూంటాయి. దేశవ్యాప్తంగా పేరున్న మీడియా సంస్థ కావడంతో.. సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రభుత్వాలు ఇస్తూంటాయి. ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలకు ప్రజా ధనం వివిధ కారణాలతో పెద్ద ఎత్తున కట్టబెట్టిన జగన్ సర్కార్.. ఈ ఈవెంట్ ను టైమ్స్ కు ఇవ్వడం ద్వారా…. మీడియా మేనేజే మెంట్ లో కూడా అనుకున్నది సాధించినట్లయింది. టైమ్స్ గ్రూప్‌కు ముందుగానే డబ్బులు చెల్లించారని చెబుతున్నారు.
ఇప్పుడు అ టైమ్స్ సంస్థ … ఫేక్ సర్వేలు వేస్తోంది. వైసీపీకి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఊరూపేరూ లేని ఓ సర్వే సంస్థ పేరు చెప్పి ప్రచారం చేసేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆ సర్వేను వైసీపీ వాళ్లు కూడా నమ్మట్లేదు. డబ్బులిచ్చి ఇలాంటి సర్వేలు వేయించుకుంటే.. ప్రజాభిప్రాయం మారకపోగా మరింత ప్రమాదకరంగా పరిస్థితి మారుతుందని చాలా మంది బహిరంగంగానే చెబుతున్నారు. సరే ఇలాంటి సర్వేలు వేయించుకోవడానికే.. ప్రజాధనం టైమ్స్ కు వందల కోట్లు దారబోస్తున్నారా అందర్నీ విస్మయపరుస్తున్న విషయం.