విశాఖకు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు తొందర పడుతున్నారు. నిజంగానే ఇది నిజం. గతంలో.. అనేక మంది… ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలను చూసిన ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల నేతలు…. వ్యతిరేకత వ్యక్తం చేస్తే.. ఏమీ మిగలదని.. వ్యతిరేకులనే ముద్ర తప్ప.. అని డిసైడైపోయి.. విశాఖ వెళ్లడానికి మద్దతు తెలుపుతున్నారు. అయితే.. ఇందులో వారు..కొన్ని షరతులు పెడుతున్నారు. దీని ప్రకారం.. మే నెల కల్లా.. సచివాలయాన్ని.. విశాఖకు తరలించడం ఇందులో మొదటిది. తమ డిమాండ్లను.. సిద్దం చేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులంతా ఓ సమావేశం పెట్టుకున్నారు కానీ..ఎందుకో వాయిదా వేసుకున్నారు.
కరోనా వల్లే జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదని ఉద్యోగ సంఘం నేతలు చెప్పుకున్నారు. సరే కారణం ఏదైనా ఉద్యోగ సంఘం నేతలు చెప్పేది ఫైనల్ కాబట్టి.. వారి చెప్పిందాని ప్రకారం.. కొన్ని డిమాండ్లు తెరపైకి వచ్చాయి. వాటిలో ఒకటి మే నెల కల్లా విశాఖ వెళ్లడమే కాదు… ఉద్యోగుల పిల్లలకు అక్కడ స్కూళ్లలో కూడా ప్రభుత్వమే అడ్మిషన్లు ఇప్పించాలి. ఇవి ప్రాధమికమైనవి మాత్రమే.. ఇక ఉచిత ఇంటి స్థలాల దగ్గర్నుంచి.. జీతాల పెంపు వరకూ చాలా డిమాండ్లు ఉద్యోగుల జాబితాలో ఉన్నాయి. అయితే… ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉద్యోగులకు .. నోటి మాట ద్వారానే.. అందరూ విశాఖకు వెళ్లాలని సర్దుకోవాలని చెబుతోంది.
అధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదు. కనీసం చర్చించ లేదు కూడా. ప్రభుత్వం ఆదేశిస్తుంది.. ఉద్యోగులు వెళ్లాలి అంతే కానీ.. డిమాండ్లు పెట్టడానికి లేదని.. కూడా కొంత మంది అంటున్నారు. ఉద్యోగులు మాత్రం.. ప్రభుత్వం అలా వదిలేయదని.. తమకు తాయిలాలు ఇస్తుందని ఆశ పడుతున్నారు. అందుకే రాజధాని మార్పునకు మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో మరి..!