ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మెల్లగా ఢిల్లీ బాట పడుతున్నారు. కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని అయినా సరే… ఏపీ నుంచి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. ఇటీవలి కాలంలో.. ఐపీఎస్‌లు వరుసగా కేంద్ర సర్వీస్‌లకు వెళ్తున్నారు. అదే సమయంలో.. ఐఏఎస్‌లూ అదే దారిలో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కాస్త విచిత్రంగా ఉందనే వాదనలు ఉన్నాయి. పోలీస్ బాస్‌కు తెలియకుండా.. పోలీసు వ్యవహారాలు నడిచిపోతూంటాయి. సీఎస్‌కు తెలియకుండా ఆదేశాలు వచ్చేస్తూంటాయి. అలాగే.. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శలకు తెలియకుండానే.. పనులు .. ఫైళ్లు నడిచిపోతున్నాయి.
అధికారులు కేవలం పదవిలో ఉండటానికేన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చాలా కొద్ది మంది గుప్పిట్లోనే అన్ని శాఖలు చిక్కుకుపోయాయంటున్నారు. ఈ కొద్దిమందిలో మళ్లీ అతి కొద్ది మంది మాత్రమే.. అధికారులు. మిగిలిన వారంతా.. అనధికార వ్యక్తులు. కొంత మందికి ప్రభుత్వం సలహాదారుల పేరుతో పదవులు ఇచ్చినా.. మరికొంత మంది మాత్రం… కేవలం.. పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం.. పార్టీలో ఉన్న పొజిషన్‌ను ఆసరాగా చేసుకుని.. పనులు నడిపించేస్తున్నారు. తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో నిలబడటం లేదు. చాలా వరకు.. తప్పుడు నిర్ణయాలు. రేపు ఏదైనా తేడా వస్తే.. కేసులు పాలవడం కూడా ఖాయమన్న చర్చ జరుగుతోంది. దానికి ఉదాహరణ.. పత్రికలకు జారీ చేసిన ప్రకటనలు. ఏ విధంగా చూసినా.. సాక్షి పత్రికకు లబ్ది చేకూర్చిన అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి విషయాల్లో తప్పించుకోవడం కష్టం.
సాధారణంగా వైసీపీ నేతలకు లబ్ది కలిగించే నిర్ణయాలు తీసుకుంటే.. వారు లబ్దిపొందుతారు.. కానీ తర్వాత అవకతవకల కేసులు పడితే వారికేమీ నష్టం ఉండదు. ఎందుకంటే.. ఆ నిర్ణయాలు తీసుకున్న అధికారులకు మాత్రమే.. నష్టం. వారే బాధ్యులవుతారు. గతంలో జరిగిన పరిణామాలు… ఈ ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్యల కారణంగా.. అనేక మంది అధికారులు ఇప్పటికే… ఇబ్బంది పడుతున్నారు. రేపు ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితేమిటన్న చర్చ… అధికారుల్లో నడుస్తోంది. అందుకే నాలుగేళ్ల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్నవారు… కేంద్ర సర్వీసుల ఆలోచన చేస్తున్నారంటున్నారు.