ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ జాతీయ కమిటీల్ని పునర్వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 మందితో టీడీపీ కేంద్ర కమిటీ.. ఇరవై మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులు కల్పించారు. పొలిట్ బ్యూరో పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల , వర్ల రామయ్య సహా.. మరో నలుగురికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణ రాజీనామా చేసిన గల్లా జయదేవ్‌కు చోటు కల్పించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, ఫరూక్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ,గుమ్మడి సంధ్యారాణిలకు చోటు కల్పించారు. అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు మరో వైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణ వద్దంటూ.. కొంత మంది నేతలు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 31 మందితో తెలంగాణ టీడీపీ కమిటీని ఏర్పాటు చేశారు.
అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించడంలో కాస్త ఆలస్యం జరగడంతో.. ఇతర టీడీపీ నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ జాతీయ కమిటీల కూర్పు కోసమే అగినట్లుగా టీడీపీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు అచ్చెన్నను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.