అప్పులు తీసుకుని తిరిగి చెల్లింకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. ఎన్పీఏగా ప్రకటిస్తాయి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్థక ఆస్తులు. రుణాలు చెల్లింకపోతే వాటిని వేలం వేసుకుంటారు అంతే కానీ కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వరు. ఇలాంటి దుస్థితి ఏపీ జెన్కోకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ..ఏపీ జెన్కో నిరర్థక ఆస్తిగా మారింది. అప్పులు తీసుకుని చెల్లించకపోవడంతో ఈ జాబితాలోకి వెళ్లిపోయింది. ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభఉత్వమే. కేంద్రం నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి జెన్కో రుణం తీసుకుంది. కానీ తిరిగి చెల్లించలేదు. 90 రోజుల గడువు ఇచ్చినా చెల్లించలేదు.
దీంతో ఎన్పీఏ కింద జమ చేసేశారు. జెన్కో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. జెన్కో పేరుతో ప్రభుత్వం రూ. 9వేల కోట్ల రుణాలను తీసుకుంది. వాటిని ఇతర అవసరాలకు మళ్లించిది. ఇప్పుడు ఆ సొమ్ములను సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థలు కోరుతున్నా… స్పందించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో జెన్కో అధికారులు పడిపోయారు. ఏపీ అర్థిక పరస్థితిని వివరించడానికి ఢిల్లీ వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.
అయితే ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టేసి ఎన్పీఏ జాబితా నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అందుకే కేంద్రమే రుణం ఇచ్చి.. ఆ రుణాన్ని జమ చేసుకుని ఎన్పీఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతోంది.దానికి కేంద్రం అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏపీలో రుణాల తీరు.. తిరిగి చెల్లించని వైనం మరోసారి జెన్ కో ద్వారా హాట్ టాపిక్ అవుతోంది.