హైదరాబాద్ శివారు ప్రాంతాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ ఊహించనంతగా పెరుగుతోంది. అలాంటి ఓ శివారు గ్రామం మన్నెగూడ. హైదరాబాద్‌కు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా రియల్టర్లు గుర్తించారు. అందుకే అక్కడ వెంచర్లు, ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నారు.
మన్నెగూడ హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లకు సమీపంలో ఉంటుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు నిమిషాల్లో చేరుకోవచ్చు.త ఓఆర్ఆర్ తో పాటు ఇతర రహదారుల ద్వారా మంచి కనెక్టివిటీ ఉంది. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ ప్రణాళికలు ఈ ప్రాంతానికి చరితం డిమాండ్ ను పెంచుతున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు హైదరాబాద్ కోర్ ఏరియాలతో పోలిస్తే సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్ మరియు మధ్యతరగతి కుటుంబాల నుండి డిమాండ్ పెరుగుతోంది. యాభై లక్షల నుంచి అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. కోటిన్నరకు విల్లా వస్తోంది.
ఈ ప్రాంతంలో భూమి ధరలు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా పెరుగుతున్నాయి. మన్నెగూడులో సస్టైనబుల్ హోమ్స్, గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో కూడిన ప్రాజెక్టులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న బిల్డర్లు ఎక్కువగా నిర్మాణాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తూండటంతో.. వచ్చే నాలుగైదేళ్లలో ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.