ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులనూ వదిలి పెట్టలేదు. వారిని విచారణకు రావాలని గత నెల ఇరవై రెండో తేదీననోటీసులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు వచ్చి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదం అవుతోంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో పీవీ రమష్ తల్లిదండ్రులు నివాసం ఉంటుంది. ఏపీ సీఐడీకి చెందిన ముగ్గురు పోలీసుల బృందం .. వారి ఇంటికి చేరుకుని విచారణకు హాజరు కానందున అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు.
అయితే మీడియాకు తెలియడంతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఏ కేసులో విచారణకు రావాలని అడిగారో కూడా తమకు తెలియదని పీవీ రమేష్ తల్లిదండ్రులు అంటున్నారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తమ అల్లుడన్నారు. కూతురులో వచ్చిన అభిప్రాయభేదాల విషయంలో తమను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. పీవీ రమేష్‌ను గతంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి.అయితే అప్పట్లో నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వచ్చామన్నారు. సీఐడీ సునీల్ కుమార్ భార్య పీవీ రమేష్ సోదరి. అయితే సునీల్‌పై ఆమె గృహహింస కేసు పెట్టారు.
ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేలా చేయడానికి సీఐడీ సునీల్ కుమార్ ఇలా చేస్తున్నారని పీవీ రమేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సునీల్ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. వ్యక్తిగత అంశాలను సెటిల్ చేసుకోవడానికి సీఐడీ ఉన్నతాధికారి ఇలా అధికారా్ని అడ్డం పెట్టుకుంటున్న వైనం.. ఏపీ ఉన్నతాధికారవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.