తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిదింది. ఇరవయ్యో తేదీ తర్వాతే సమావేశం పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు., పైగా ఈ రోజు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు సీఎంలు హాజరైతేనే అపెక్స్ భేటీ అయినట్లు. కేసీఆర్ నిరాసక్తత కారణంగా ఈ భేటీ వాయిదా పడింది. అయితే… కేసీఆర్‌కు… కృష్ణా జలాలను కాపాడే అంశంపై ఆసక్తి లేదని అందుకే.. అపెక్స్ భేటీకి హాజరవకుండా… రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరిస్తున్నారని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కౌంటర్‌గా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా… కట్టాలనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని… తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే.. ఈ టెండర్లు నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. అయితే.. కృష్ణాబోర్డు ఆదేశాలను పట్టించుకోవాలని ఏపీ అనుకోవడం లేదు. శ్రీశైలం నుంచి నీటిని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ తరలిస్తున్నా.. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఏపీ ఆగ్రహంతో ఉంది. అలాంటప్పుడు.. తాము టెండర్లను ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది. ఈ కారణంగా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్ పద్దతిలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు ఎప్పుడు వస్తుందనేది.. త్వరలో తెలియనుంది. ఇప్పటికి రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పనులు.. ప్రాసెస్‌లో ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పందొమ్మిదో తేదీన టెండర్లను ఖరారు చేయనున్నారు. టెండర్లను ఖరారు చేసుకోవచ్చు కానీ… నిర్మాణాలు ప్రారంభించవద్దని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టం చేసింది.