ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామికంగానే కాకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుసుకువెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల్లో వేర్వేరు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను( మెమొరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ – ఎం ఒ యు) కుదుర్చుకుంది. ఈ ప్రకారం ఆయా కంపెనీలు 1 లక్షా 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతాయి. ఫలితంగా 1లక్షా20వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన వనరు అని నమ్మే ముఖ్యమంత్రులలో ముఖ్యుడు చంద్రబాబు నాయుడు. రాజధానితో సహా ప్రతిరంగాన్నీ కొత్తగా నిర్మించుకోవలసివున్న నేపధ్యంలో వనరులను అన్వేషించవలసిన అనివార్యత నుంచి ఎవరు అధికారంలో వున్నా తప్పించుకోలేరు కూడా. ప్రభుత్వానికి వ్యాపార సంస్ధకు మధ్య ఎం ఒ యు లలో కంపెనీలు లాభాలతోపాటు ప్రభుత్వం నుంచి సహజంగా లభించే అండదండలతో పాటు రక్షణను ఆశిస్తాయి. ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కొట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్ధంగా వున్న కంపెనీలు ప్రతీ కొటిరూపాయల పెట్టుబడిమీదా ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడానికి హామీ ఇస్తున్నాయి. ఆటోమేషన్, కంప్యూటరైజేషన్ లతో పరిశ్రమలు నడుస్తున్న కాలంలో 1.20 లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులపై 1.2 లక్షల మందికి ఉద్యోగాలంటే పెద్ద సంఖ్యే అనిపించవచ్చు. అయితే ఆపెట్టుబడుల నిమిత్తం ఆయాకంపెనీలకు ప్రభుత్వం ఇచ్చేసే భూముల ధర, విస్తీరణాలను బట్టే ఈ డీల్ ప్రజాప్రయోజనాలకు అనుకూలమో, వ్యతిరేకమో లెక్కతేలుతుంది.
శంకుస్ధాపన కు రాష్ట్రప్రభుత్వమే పెద్ద హైప్ ను తెచ్చిన కారణంగా ప్రజల దృష్టి , ఆసక్తి అమరావతి మీద వున్న సందర్భాన్ని వుపయోగించకుని మూడునెలలుగా సంతకాలైన ఎం ఒ యుల పై సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. రాబోతున్న పరిశ్రమల వివరాలు మినహా వాటికి కేటాయించే భూముల విస్తీర్ణాలేవీ ఆ ప్రకటనలో లేవు. పరిశ్రమలు ఎప్పటికి మొదలవ్వాలి అనే వివరాలు వుండి వుంటే, హైదరాబాద్ తో పాటే ఉద్యోగావకాశాలు పోయాయని దుగులు పడుతున్న యువతకు ఈ ప్రకటన పెద్ద భరోసా అయ్యేది. అయినా కూడా చిన్న ఆశను చిగరింపజేసేలా వున్న ప్రకటన వివరాలుఇలా వున్నాయి.
18 ఎంఓయులను 79వేల 34కోట్ల రూ.లతో ప్రత్యేకంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుడులను పెట్టి 28వేల 716 ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగింది.వాటిలో ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీ,ఎలక్ర్టానిక్స్,ఆటోమొబైల్,బయోటెక్,టెక్స్టైల్స్,సిమ్మెంట్,ఐరన్పెల్లెట్స్,టియంటి బార్స్, రసాయనాలు, పరుపుల తయారీ రంగాలకు సంబంధించినవి ఉన్నాయి.
జపాన్ కు చెందిన ఎస్ బి సోలార్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ గ్రూపు ఆఫ్ కెంపేనీకి చెందిన సాప్టు బ్యాంకు ఆధ్వర్యంలో 20 గిగావాట్ సోలార్ పవర్ యూనిట్,1గిగావాట్ విండ్ పవర్ (2 గిగావాట్ సోలార్,1గిగావాట్ విండ్ పవర్ యూనిట్లనుమొదటి దశ కింద 18వేల కోట్ల రూ.ల పెట్టుబడులతో ఏర్పాటు చేయడం ద్వారా 6వేల ఉద్యోగఅవకాశాలను కల్పించేందుకు వీలుగా అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది.
ద్వితీయ కేటగిరీ కింద ప్రధానంగా విశాఖపట్నంలో 17వేల కోట్ల రూ.లతో హెచ్ పిసిఎల్ విశాక రిఫైనరీ ప్రాజెక్టు ద్వారా దాని ప్రస్తుత సామర్ద్యం 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడం ద్వారా 34వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలవుంతుంది.అలాగే ఎపిఎండిసి మరియు ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్ ప్లాంటు)సంయుక్త ఆధ్వర్యంలో 4వేల కోట్ల రూ.ల పెట్టుబడితో కర్నూల్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాంగనీస్ ఖజనం తవ్వకం ప్రాజెక్టు చేపట్టి తద్వారా 5వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అదేవిధంగా కర్నూల్ జిల్లాలో 3వేల కోట్ల రూ.ల పెట్టుబడితో జయ్ రాజ్ ఇస్పాత్ లిటిటెడ్ ప్రాజెక్టును చేపట్టి 1100మందికి ఉపాధి కల్పించేందుకు కృషి జరుగుతోంది.
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్న పాలెం గ్రామంలో 1600 కోట్ల రూ.లు వంతున పెట్టుబడులు పెట్టడం ద్వారా హీరో మోటార్ కార్పొరేషన్ దాని మరో ద్విచక్రవాహన తయారీ అనుబంద సంస్థతో కలిసి ద్విచక్ర వాహన తయారీ ప్రాజెక్టును నెలకొల్పి యేడాదికి 1.8మిలియన్ ద్విచక్ర వాహనాలను తయారూ చేసేందుకు ముందుకు రావడం జరిగింది. తద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగాను,పరోక్షంగాను ఉద్యోగ ఉవకాశాలను కల్పించనుంది ఇంకా స్పష్టం చేయలేదు.
పశ్చిమ గోదావరి జిల్లాలో విఇయం టెక్నాలజీస్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థ 2వేల కోట్ల రూ.ల పెట్టుబడితో ఏరోసిటీ ప్రాజెక్టును నెలకొల్పి 3వేల 750 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.కర్నూల్ జిల్లా దోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామంలో ఎంపిఎల్(మినరల్ ప్రాసెసింగ్ ప్రవేట్ లిమిటె)ఆధ్వర్యంలో 1000కోట్ల రూ.ల పెట్టుబడితో ఇనుప ఖనిజం ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా 800 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరగుతోంది.అదే జిల్లాలోని పాణ్యంలో 900కోట్ల రూ.ల పెట్టుబడితో శాంతిరామ్ కెమికల్స్ పేరిట కాల్షియం కార్పొనేట్ మరియు నానో ప్రిడికేటెడ్ కాలషియం కార్పొనేట్ యూనిట్ ను నెలకొల్పడం ద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.తూర్పు గోదావరి జిల్లాల్లో 900 కోట్ల రూ.లు పెట్టుబడితో ట్రైడెంట్ గ్రీన్ టెక్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ సీ మినరల్ కాంప్లెక్సును ఏర్పాటు చేయడం ద్వారా 3500 మందికి ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
అలాగే మరో 10 అంశాలకు సంబంధించి ఇంకా అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవాల్సి ఉంది.అవి కూడా చేసుకోవడం పూర్తయితే నిర్దేశిత లక్ష్యానికి మించి పెట్టుబడులను, ఉద్యోగావ కాశాలను కల్పించేందుకు వీలవుతుంది.ఇంకా ఎంఓయులు కుదుర్చుకోవాల్సిన వాటిలో ప్రధానంగా ఇంధన రంగం కేటగిరీలో యాక్సిస్ విండ్ ఎనర్జీ లియిటెడ్స్ వారి ద్వారా 39వేల కోట్ల రూ.లు పెట్టుబడులతో 4000మెగావాట్ విండ్ ఫవర్ మరియు 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడి తద్వారా 13వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలవుతుంది.