సీదిరి అప్పలరాజు టీడీపీ సెల్ఫీ చాలెంజ్‌కు ఏదో ఓ విధంగా సమాధానం చెప్పాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వ పనితీరును బయట పెట్టేశారు. ఇప్పుడు ఆయన కావాలని జగన్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేశారేమో అన్న డౌట్ వైసీపీ నేతలకు వస్తోంది. సీదిరి అప్పలరాజు ఉ ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి తన ముఖానికి సీఎం జగన్ ఫొటో ఉన్న మాస్క్ పెట్టుకుని టీడీపీకి సెల్ఫీ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలని అచ్చెన్నాయుడుకు సవాల్ చేశారు.
నిజానికి ఉద్దానం కిడ్నీ రీసెస్చ్ సెంటర్ కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. దీనికి కారణం పవన్ కల్యాణ్. ఆయన ఈ అంశంపై పోరాటం చేయడంతో అప్పటి సీఎం అనేక రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈ ఆస్పత్రి నిర్మాణానికి రెడీ అయ్యారు. శంకుస్థాపన చేశాక ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ .. అన్నిట్లాగా నాలుగేళ్ల తర్వాత కాకుండా ముందుగానే దానికి శంకుస్థాపన చేశారు. అప్పటికీ కాంట్రాక్టర్ ఖరారు కావడంతో ఇక పనులు జరుగుతాయనుకున్నారు.
ఇప్పటికి నాలుగేళ్లయింది. ఆ భవనం పని సగం కూడా పూర్తి కాలేదు. నాలుగేళ్లలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను సగం కూడా పూర్తి చేయలేని చేతకానితనంపై అక్కడ జనం ప్రతీ సారి విమర్శలు చేస్తూంటే. సీదిరి అప్పలరాజు మాత్రం అదే మా గొప్పతనం అన్నట్లుగా చాలెంజ్ చేశారు. అసలు మూడేళ్లలో అమరావతి లాంటి రాజధానిని కట్టలేదని విమర్శలు చేసే వైసీపీ నేతలు చిన్న ఆస్పత్రిని నాలుగేళ్ల పాటు కడుతూనే ఉన్నారనే.. స్పృహ ప్రజలకువస్తుందనే విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియా దెబ్బకు పులివెందుల బస్టాండ్ ను సగం పూర్తి చేయడం.. ఈ కిడ్నీ ఆస్పత్రి పనుల మెల్లగా అయినా చేయించటం చేస్తున్నారు కానీ.. అసలు ఏపీలో ఇతర పనులేమీ జరగడంలేదు. ఆ విషయాన్ని అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ తో నిరూపించేసినట్లయింది.