అధికారం ఉంది కదా అని చెలరేగిపోయిన వైసీపీ నేతలకు టైం దగ్గర పడింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమయింది. వారి నేతృత్వంలోనే దాడి జరిగినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. వారి ముఖ్య అనుచరుల్ని నేరుగా టీడీపీ ఆఫీసుకు రాళ్లు, కర్రలతో పంపించారు. అన్ని దృశ్యాలు నమోదయ్యాయి.
ఆ రోజున గుంటూరు వైపు నుంచి .. విజయవాడ వైపు నుంచి … మంగళగిరి నుంచి వచ్చిన దుండగల్ని గుర్తించారు. వారు వచ్చిన వాహనాలు.. వారు ఎవరి వద్ద నుంచి ఆదేశాలు తీసుకున్నారో మొత్తం కాల్ లిస్టులు… టోల్ గేట్ వద్ద రికార్డులు తీసుకుని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పక్కా స్కెచ్ వేశారని … తెలుసుకున్నారు. విజయవాడలో పట్టాభిరాం ఇంటిపై దాడి… టీడీపీ ఆఫీసుపై దాడి ఏకకాలంలో జరిగేలా దేవినేని అవినాష్ తన ముఠాను ప్రేరేపించారు. దాడికి గుంటూరు నుంచి తన అనుచరుల్ని పంపారు లేళ్ల అప్పిరెడ్డి. ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి తగిన ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది.
నందిగం సురేష్ తన అనుచరుల్ని కూడా పంపారు. విధ్వంసం వీడియోల్ని ఆయన అనుచరులు ఆయనకు షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అప్పిరెడ్డి, అవినాష్, నందిగం సురేష్ అరెస్టుతో ఆగిపోయేదేమీ ఉండదని.. వారి ముగ్గురికి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీస్తారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం సజ్జల స్థాయిలో జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా చట్టబద్ధంగా టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన లెక్క తేల్చబోతున్నారు.