ఏప్రిల్లో మెగా హీరోల సందడికనిపించబోతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే నెలలో… సరైనోడు కూడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నీ కుదిరితే సాయిధరమ్ తేజ్ సుప్రీమ్నీ ఏప్రిల్లోనే విడుదల చేస్తారు. సర్దార్ ఆడియో ఈనెల 20 న ఫిక్సయ్యింది. ఇప్పుడు పవన్ని ఫాలో అవుతూ.. బన్నీ కూడా తన పాటల్ని వినిపించబోతున్నాడు. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సరైనోడు… షూటింగ్ తుది దశకు చేరుకొంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలూ షురూ అయ్యాయి.
ఇప్పుడు పాటల విడుదల తేదీ ఫిక్సయ్యింది.
ఏప్రిల్ 2న ఆడియో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. అయితే వేదిక మాత్రం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారు. నిజానికి ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పాటల్ని విడుదల చేయాలనుకొన్నారు. అయితే ఆ రోజు సర్దార్ సినిమా విడుదల ఖాయమవ్వడంతో.. బన్నీ ఆడియో ఫంక్షన్ ముందుకొచ్చింది.