ఇండియన్ సినిమాకి థియేటరికల్ మ్యూజిక్ ని పరిచయ చేసిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. రోజా సినిమాతో ఆయన ప్రస్తానం మొదలైయింది. అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. తన స్వర విన్యాసంతో ఆడియన్స్ మనసులను కొల్లగొట్టేశాడు. ఈ పాతికేళ్ళ ప్రయాణంలో రెహ్మాన్ నుండి ఎన్నో అద్భుతాలు. ఆ అద్భుతాలన్నీటి లైవ్ లో విని, చూసే అవకాశం భాగ్యనగర వాసులకు దక్కింది. ఏఆర్ రెహ్మాన్ లైవ్ షో గచ్చిబౌలి వేదికగా జరిగింది. మూడు గంటలు పాటు జరిగిన ఈ లైవ్ షో ఆద్యంతం కట్టిపడేసింది. రెహ్మాన్ సంగీతంలో తడసిముద్దయ్యారు వీక్షకులు.
నిజంగా ఇది గ్రేట్ షో అనే చెప్పాలి. హైదరాబద్ లో చాలా మ్యూజికల్ ఈవెంట్స్ జరిగాయి. కానీ ఈ షో మాత్రం చాలా ప్రత్యేకం. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం ఎలా నిండిపొతుందో .. అలా నిండిపోయింది గచ్చిబౌలి. అక్కడ ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా స్టాండ్స్ ఖాళీగా కనిపిస్తుంటాయి. కానీ ఈ ఈవెంట్ లో స్టాండ్స్ మొత్తం కిటకిటలాడాయి. ఫుల్ ప్యాక్డ్. రెహ్మాన్ అంటే ఎంత క్రేజు వుందో ఆ జనాలు చూస్తే అర్ధమౌతుంది.
ఫుల్ కమర్షియల్ షో అయినప్పటికీ పైసా వసూల్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ ని ఈ షో కట్టిపడేసింది. మూడు గంటలు పాటు రెహ్మాన్ సంగీతంలో మునిగితేలారు. ప్రతిపాటను ఎంజాయ్ చేశారు. ఇక స్టేజ్ డిజైన్ కట్టిపడేసింది. మ్యూజిక్ షో అంటే చెవులకే పని. కానీ ఇక్కడ ప్రతి పాటకు స్టేజ్ పై ఎదో ఒక యాక్టివిటీ జరిగింది. కలరింగ్ అదిరిపోయింది. ఎక్కడా బోర్ కొట్టించకుండా షోని నడిపాడు రెహ్మాన్. ఆయన చాలా యాక్టివ్ గా కనిపించడు. మూడు గంటల షోలో మంచి వేరియేషన్స్ చూపించాడు. పాటలు తగ్గట్టు తన డ్రెస్ కోడ్ ని కూడా మార్చుకోవడం విశేషం. ‘
ఈ షోతో రెహ్మాన్ ను తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో మరోసారి రుజువైయింది. జనరల్ గా మ్యూజిక్ ఈవెంట్ అంటే ఓ గంట తర్వాత డల్ అయిపోతుంది. జనాలు కూడా మెల్లమెల్లగా పలుచపబడిపోతారు.కానీ నిన్నటి షోలో మాత్రం స్వయంగా రెహ్మాన్ ‘బాయ్’ చెప్పేవరకూ స్టేడియం ఫుల్ ప్యాక్డ్ గానే వుంది. ఇది ఒక్కటి చాలు ఈ షో హిట్ అని చెప్పడానికి.