చిత్ర పరిశ్రమ ఇప్పుడు బాహుబలి.. బాహుబలి.. అని కలవరిస్తుంది. ఎక్కడ చూసిన ఇదే టాపిక్. బాహుబలి తో సరికొత్త చరిత్ర సృస్టించిన రాజమౌళి.. ఇప్పుడు పార్ట్ 2ను సిద్ధం చేశారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన అన్నీ భాషల్లో కలిపి ఒకే రోజులు ఐదు కోట్ల వ్యూస్ ను సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలిదే ఈ రికార్డ్. బాహుబలిపై ఏ రేంజ్లో అంచనాలు వున్నాయో.. ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవడం ఇంకా ఎక్కువైయింది. ఇప్పుడు ఏ సినిమా ప్రముఖులను కదిలించిన బాహుబలి ముచ్చటే. ఈ లిస్టు లో ఆస్కార్ విజేత ఏ. ఆర్ రెహ్మాన్ కూడా చేరిపోయారు.
మణిరత్నం-రెహ్మాన్ ల కొత్త చిత్రం చెలియా. ఈ సినిమా ఆడియో వేడుక పార్క్ హయత్ లో జరిగింది. ఈ వేడుకలలో మాట్లాడిన రెహ్మాన్ బాహుబలి ని ప్రస్తావించారు. ”ఇండియన్ సినిమా ఎంతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమా. బాహుబలి తో వండర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పార్ట్ ట్రైలర్ చూస్తుంటే ఎంతో ఆనందంగా,గర్వంగా. ఇదో గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. బాహుబలి లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఏడాదికి నాలుగు పరిశ్రమల నుండి కనీసం నాలుగు బాహుబలిలు రావాలనేది నా కోరిక” అని వ్యాఖ్యానించారు రెహ్మాన్.
బాహుబలి పై ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ప్రసంసలజల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ విజేత కాంప్లీమెంట్స్ కూడా అందుకుంది బాహుబలి.