రానా కథానాయకుడిగా నటించిన ద్విభాషా చిత్రం `అరణ్య`. ప్రభు సాల్మన్ దర్శకుడు. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న సినిమా ఇది. అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమా లేదు. ఇప్పుడు మార్చి 26న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. పేరుకు తగ్గట్టు అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కోసం రానా బాగా కష్టపడ్డాడు. బరువు బాగా తగ్గాడు. చిత్రీకరణ సమయంలోనూ చాలా కష్టాలు ఎదురయ్యాయి. మొత్తానికి ఈ సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేశారు. సంక్రాంతికి ఎక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో.. ఈ సినిమాని వేసవికి షిఫ్ట్ చేసేశారు. ఈ సంక్రాంతికి `అరణ్య` టీజర్ విడుదల చేసే అవకాశం వుంది.