వికీ లీక్స్, సుచి లీక్స్ తరహాలో ఓ లీక్ తరవాత కొన్ని రోజులు విరామం, విశ్రాంతి తీసుకుని ఇంకో లీక్ చేస్తున్నారు… యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అరవింద సమేత… వీరరాఘవ’ సినిమా సీన్లు! ఇప్పటికి ఓసారి లీకులు సినిమా యూనిట్‌ని టెన్షన్ పెట్టాయి. ఎన్టీఆర్, నాగబాబు కారులో ప్రయాణిస్తుండగా ఎవరో అటాక్ చేస్తే నాగబాబు ప్రాణాలు కోల్పోయిన స్టిల్ ఎప్పుడో బయకు వచ్చింది. తాజాగా లీకైన వీడియో దానికి ఎక్స్’టెన్షన్’ అన్నమాట!
అధికారికంగా సినిమా టీజర్ బయటకొచ్చింది కదా! అందులో కల్వర్ట్ ఒకటి బ్లాస్ట్ అయ్యే సీన్ ఒకటుంది. దానికీ ఈ లీకైన వీడియో ఎక్స్’టెన్షన్’. కల్వర్ట్ బ్లాస్ట్‌కి ముందు ఎన్టీఆర్, నాగబాబు అనుచరులతో కలిసి వస్తున్న దృశ్యాలు… బ్లాస్ట్ తరవాత నాగబాబును ప్రత్యర్థులు కాల్చి చంపే దృశ్యాలు… ఆ వీడియోలో వున్నాయి. గ్రాఫిక్స్ కోసం పంపితే అక్కడి నుంచి లీకైనట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ పూర్తి కాకమునుపే వీడియో లీకైంది. ఈ లీకులు సినిమా టీమ్‌ని కలవరపెడుతున్నాయి. సాంగ్ షూటింగ్ కోసం ఎన్టీఆర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ ఇటలీ వెళ్లారు. ఓపక్క అనుకున్న టైమ్‌కి షూటింగ్ కంప్లీట్ చేయాలనే టెన్షన్.. మరోపక్క లీకుల టెన్షన్! ఈ లీకులపై టీమ్ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది.