అక్టోబర్ 11న ‘అరవింద సమేత వీరరాఘవ’ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అంటే… విడుదలకు గట్టిగా రెండు వారలు కూడా లేదు. అందుకని, శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఓ పాట చిత్రీకరణ కోసం ‘అరవింద సమేత’ యూనిట్ ఇటలీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన వెంటనే ఇండియాలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, ఈషా రెబ్బా ఇతర ప్రధాన తారాగణంపై నృత్య దర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో ‘పెనివిటి…’ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని, గుమ్మడికాయ కొడతారని సమాచారం. మరోపక్క ఈషా రెబ్బా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. సినిమాలో ముఖ్య కథానాయిక పూజా హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. ఓ పక్క ‘పెనివిటి…’ పాట చిత్రీకరణ చేస్తూ మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలను చేయిస్తున్నారు త్రివిక్రమ్. పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి అవుతాయని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ నమ్మకంగా వున్నార్ట. అక్టోబర్ 2న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.