ఉత్తరాంధ్రలో మరో భారీ స్టీల్ ప్లాంట్ రానుంది. ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో పేరెన్నికగన్న ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. మొత్తంగా రూ. 70 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయింది. నక్కపల్లి వల్ల ఇప్పటికే పారిశ్రామిక సంస్థల కోసం అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశ కోసం భూసేకరణ చేయల్సిన అవసరం లేదు. 2029 కల్లా మొదటి దశ స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేయాలని ఆర్సెలార్ మిట్టల్ భావిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వ వర్గాలో సంప్రదింపులు చివరి దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అనకాపల్లిలోనే ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేయడానికి కారణం వారికి ముడి ఖనిజం అందుబాటులో ఉండటమే. స్టీల్ ప్లాంట్ కు ముడి ఖనిజం కీలకం. చత్తీస్‌ఘడ్‌లోని ఎన్ఎండీసీకి ఉన్న గనుల నుంచి ముడి ఖనిజం తీసుకునేందుకు ఆర్సెలార్ మిట్టల్‌కు అనుమతి ఉంది. భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన ఖనిజాన్ని తవ్వేందుకు కూడా సంస్థ వద్ద ప్రణాళికలు ఉన్నాయి.
యూరప్ దేశాల్లో అత్యధిక మార్కెట్ ఉన్న ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ ను సొంతం చేసుకునేందుకు విస్తృతంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. ఈ క్రమంలో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా వేగంగా నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనభై వేల మంది ఉపాధి పొందుతారు.