https://www.youtube.com/watch?v=KZlgjWutVys&feature=youtu.be
ప్రశ్నించడానికి సమాజం, వ్యక్తులు, సంఘాలూ, వ్యవస్థలూ అవసరం లేదు. అప్పుడప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్యత తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్రశ్నించడానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి వస్తోంది. అదే.. `అర్థ శతాబ్దం`.
నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం కథానాయకులుగా నటించిన చిత్రమిది. రవీంద్రపుల్లే దర్శకుడు. టీజర్ ఈరోజు విడుదలైంది.
న్యాయం ధర్మం అవుతుంది గానీ, ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు
యుద్ధమే ధర్మం కానప్పుడు – ధర్మ యుద్ధాలెక్కడివి?
ఈ స్వతంత్య్ర దేశంలో.. గణతంత్రం.. ఎవరికో, ఎందుకో, దేనికో..?
ఈ విశాల భారతానికి.. అఖండ రాజ్యాంగం!!
– ఇవీ.. ఈ టీజర్లో కనిపించిన, వినిపించిన ప్రశ్నలు. ఆర్.ఆర్, షాట్స్, మూడ్.. అన్నీ యమ సీరియస్గా కనిపించాయి. కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమా.. ఒక్క క్షణం కళ్లముందు కదిలేలా.. టీజర్ వుంది.