వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను జగన్ మార్చేశారు. వీరిలో దళిత నేతలే ఎక్కువ. నిందను తమపై వేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎస్సీ నేతలు మథనపడుతున్నారు. మొదటిలిస్టులో ఇద్దరు ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యేకు స్థానచలనం చేశారు. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమాలపు సురేష్‌ను కొండేపి నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు. ఆ స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించారు. ఒకటీ రెండు ఘటనల మినహా ఆదిమూలపు సురేష్ కూడా అధిష్టానం మెప్పు పొందలేకపోయారు. అసెంబ్లీలో టీడీపీపై ఘాటు విమర్శలు చేసే నాగార్జునకు.. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో సీటు మార్చేశారని చర్చ నడుస్తోంది.
రెండో విడతను పరిశీలిస్తే.. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. ఆ స్థానంలో విప్పర్తి వేణుగోపాల్‌కు అవకాశం కల్పించారు. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వైపు మొగ్గుచూపని వైసీపీ అధిష్టానం ఆ స్థానంలో కంబాల జోగులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. మూడో లిస్టులోనూ చాలా మార్పులు చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టిక్కెట్ నిరాకరించిన అధిష్టానం.. ఆ స్థానంలో కంభం విజయరాజుకు అవకాశం ఇచ్చింది. పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్గా ఉన్న MS బాబుకు మొండిచేయి చూపించిన జగన్… ఆ స్థానంలో మూతిరేవుల సునీల్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేయటంపై.. సిట్టింగ్ ఎమ్మెల్యే MS బాబు.. వైసీపీ అధిష్టానాన్ని తప్పుబట్టారు
కోడుమారు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్‌కు టిక్కెట్ ఇవ్వని YCP అధిష్టానం.. అక్కడ నుంచి డాక్టర్ సతీష్‌కు ఎంపిక చేసింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ స్థానంలో మేరిగ మురళిని పోటీ చేయిస్తోంది. తొలినుంచి జగన్‌కు అండగా నిలిచిన వరప్రసాద్‌కు కూడా టిక్కెట్ నిరాకరించటం.. వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు ఈ సారి నిరాశే ఎదురైంది. ఆయనకు మరోసారి టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపలేదు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మద్దిల గురుమూర్తికి అవకాశం కల్పించారు. తిరుపతి ఎంపీ సీటును ఆదిమూలంకు కేటాయించారు. ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయంతో లోక్‌సభకు పోటీకి సిద్ధమయ్యారు ఆదిమూలం.
నాలుగో విడత జాబితాలోనూ పలు మార్పులు చేసిన వైసీపీ.. అక్కడ కూడా ఎస్సీ నేతలకే స్థానచలనం కల్పించింది. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌ను కొనసాగించేందుకు ఇష్టపడని సీఎం జగన్.. ఆ స్థానంలో డాక్టర్ సుధీర్‌కు అవకాశం కల్పించారు. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిపై సీతకన్ను వేసిన వైసీపీ.. ఆ స్థానంలో ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చింది. . ఏపీలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 21 మందిని మార్చిన వైసీపీ.. నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరి స్థానచలనం కల్పించింది. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లురుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు. కి ఆయా ఎమ్మెల్యేలు కూడా ఈ మార్పులను ఊహించి ఉండరు. దళిత ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఉందా అన్న ప్రశ్నలు వారు వేస్తున్నారు.