కేసీఆర్ – కేటీఆర్ ల మధ్య పంచాయితీ నడుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త చర్చకు తెరలేపారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా ఆరోపణలు కూడా అనిపించడం లేదు. గతంలో జరిగిన ప్రచారంకు.. రేవంత్ తాజా వ్యాఖ్యలు తోడవ్వడంతో ఈ అంశంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఇటీవల అసెంబ్లీకి కేసీఆర్ రారని కేటీఆర్ ప్రకటించారు కానీ ఆ మరుసటి రోజే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో ఈ విషయాన్ని ముందుంచి కేసీఆర్ – కేటీఆర్ ల మధ్య సయోధ్య లేదంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. నిజానికి, కొంతకాలం కిందటే కేసీఆర్ – కేటీఆర్ ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని ప్రచారం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్దామని కేటీఆర్ ప్రతిపాదించారని..దాని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని దాంతో ఫలితాల తర్వాత కేసీఆర్ పై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం నడిచింది.
Also Read : డ్యామేజ్ కంట్రోల్ .. దారి తప్పుతున్న కేటీఆర్?
ఈ క్రమంలోనే తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజంగానే రేవంత్ వ్యాఖ్యల్లో నిజముందా..? లేక, బీఆర్ఎస్ ను మరింత కన్ఫ్యుజ్ చేసేందుకు ఈ కామెంట్స్ చేశారా..? అని గులాబీ పార్టీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఏదీ ఏమైనా రేవంత్ తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఓ కొత్త చర్చకు తెర లేపినట్లు ఆయింది.