బూతులతో విరుచుకుపడుతున్న కొడాలి నాని విషయంలో టీడీపీ సరికొత్త ఆరోపణలు తెరపైకి తీసుకు వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో సమీప బంధువులైన ఇద్దరు కాపు నేతలు కొంత కాలం వ్యవధిలో అనుమాస్పదంగా చనిపోయారు. వారిలో ఒకరి పేరు లంకా విజయ్. ఆయన రైతు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. తన సూసైడ్‌కు కారణం కొడాలి నాని అని లేఖ రాసి పెట్టారని.. కానీ దాన్ని మాయం చేశారని గుడివాడలో ఓ గుసగుస ఉంది. ఆయన సమీప బంధువు అడపా బాబ్దికు ఈ సూసైడ్ అందిందని చెప్పుకున్నారు. అయితే హఠాత్తుగా అడపా బాబ్జి కూడా అకాల మరణం చెందారు. గుండె పోటుతో చనిపోయారు.
దీంతో ఇద్దరుసమీప బంధువులు హఠాన్మరణం చెందడం వారివురూ వైసీపీకే చెందినవారుకావడంతో టీడీపీ నేతలు దీన్ని అందిపుచ్చుకున్నారు. పైగా కాపు సామాజికవర్గం కావడంతో వారు రాజకీయ ఆరోపణలుప్రారంభించారు. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన కేసినో వ్యవహారంలో డీఎస్పీ కమిటీతో విచారణ చేయిస్తున్నామని పోలీసులు ప్రకటించారు కానీ ఇంత వరకూ ఆ కమిటీ రిపోర్ట్‌ను కూడా బయట పెట్టలేదు. దీంతో టీడీపీ పొలిట్ బ్యూబో సభ్యుడు వర్ల రామయ్య.. ఈ అంశాలన్నింటినీ కలిపి డీజీపీకి లేఖ రాశారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఆరోపణలు తీవ్రంగా వస్తున్న సమయంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని వర్ల రామయ్య కోరారు. అయితే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసినో వ్యవహారంలోనే పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వలేదు.. వేసినట్లుగా చెప్పిన డీఎస్పీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది… వర్ల రామయ్య లేఖ రాశారని డీజీపీ విచారణ చేయిస్తారా ?అని టీడీపీ నేతలు ఆశపడటం లేదు. కానీ ప్రజల్లోకి ఓ అంశాన్ని తీసుకెళ్తున్నామని అనుకుంటున్నారు.