మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా సినిమాలతో మమేకం అయినవాళ్లే. నిర్మాణ రంగంలోనూ కనిపిస్తున్నారు. మోహన్ బాబు, మనోజ్, విష్ణు, లక్ష్మీ ప్రసన్న.. వీళ్లంతా నిర్మాతలే. వీళ్లలో విష్ణు తప్ప.. అందరూ పాటలు పాడేశారు. ఇప్పుడు వీళ్ల ఇంట్లోంచి మరో ఇద్దరు గాయకులు వచ్చారు. వాళ్లే… అరియానా, వివియానా. విష్ఱు కుమార్తెలు ఇప్పుడు ఓ సినిమా కోసం పాట పాడారు. విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `గాలి నాగేశ్వరరావు`. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే అరియానా, వివియానా ఓ పాట పాడారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సినిమాలోని ఓ కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని, అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కోన వెంకట్ కథ, మాటలు అందించడం విశేషం.