పెళ్లిచూపులులాంటి రిఫ్రెష్షింగ్ లవ్ స్టోరీతో పేరు తెచ్చుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు… విజయ్ కెరీర్‌కి పూల బాట వేసింది. పెళ్లి చూపులు తరవాత దాదాపుగా అరడజను సినిమాలు అతని చేతికి అందాయి. అందులో అర్జున్ రెడ్డి ఒకటి. పెళ్లి చూపులు ఎంత సాఫ్టో.. ఈ అర్జున్ రెడ్డి అంత హార్డు. టీజర్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతోంది. నిమిషం పాటు సాగిన ఈ టీజర్లో…. దాదాపు సగానికి పైగా షార్ట్స్ (ముఖ్యంగా టేబుల్ సీన్) ఇది తెలుగు సినిమానేనా?? అనే సందేహం కలిగించేలా చేస్తున్నాయి. చివర్లో చూపించిన లిప్‌లాక్ అయితే అల్టిమెట్. మొత్తానికి టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా చేరిపోవడం ఖాయం. హీరోయిన్ షాలిని లిప్ లాక్కులకే ఒప్పుకొందంటే, వెండితెరపై ఇంకెంత ఘాటుగా కనిపించనుందో ఊహించుకోవొచ్చు.
కొత్తదరం దర్శకులు కొత్త పాయింట్‌తో రాకపోయినా.. కొత్త ట్రీట్మెంట్తో ఆకట్టుకొంటున్నారు. ఆ జాబితాలో ఈ అర్జున్ రెడ్డి కూడా చోటు దక్కించుకొంటుదేమో చూడాలి. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగా విజయ్ నటించిన మరో సినిమా ద్వారక ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాపం… దానికే ఎలాంటి హైపూ లేదు.
https://www.youtube.com/watch?v=K8emHP6xlv8