ఈనెల 18న కల్యాణ్ రామ్ సినిమా ‘అర్జున్ S/o వైజయంతీ ట్రైలర్’ విడుదలకు సిద్ధమైంది. విజయశాంతి కీలక పాత్ర పోషించిన సినిమా ఇది. ఈరోజు ట్రైలర్ వదిలారు. ఇదో యాక్షన్ డ్రామా. దాంట్లో తల్లీకొడుకుల సెంటిమెంట్ మిక్స్ చేశారు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అసలు క్రిమినల్ గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనేదే సినిమా కథ. ట్రైలర్లోనూ అదే చెప్పారు.
2 నిమిషాల 35 సెకన్ల ట్రైలర్ ఇది. యాక్షన్‌కు పెద్ద పీట వేశారు. అయితే చివర్లో ఎమోషనల్ టచ్ కూడా ఉంది
”ఇక్కడ టాప్ టెన్ లిస్ట్ ఉండదు సార్.. 1 To 10 ఒక్కడే.. అర్జున్..”
”ఇప్పటి వరకూ వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫానే చూసుంటది. మొట్ట మొదటి సారి పశ్చిమం నుంచి వచ్చే తుఫాన్ చూస్తది” లాంటి డైలాగులు వినిపించాయి.
ఓ షాట్ లో పోలీస్ గెటప్‌లో.. కల్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చారు. పటాస్ తరవాత కల్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం ఇదే తొలిసారి. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా గట్టిగా వర్కవుట్ అయ్యేట్టు కనిపిస్తోంది. మొత్తానికి నందమూరి అభిమానులకు నచ్చేలా ట్రైలర్ కట్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సాంకేతిక వర్గం బాగా కష్టపడినట్టు తెలుస్తోంది. దర్శకుడు ప్రదీప్‌కి ఇదే తొలి సినిమా. అయినా సరే, ఎమోషన్స్‌ని బాగానే హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. కమర్షియల్ గా ఈసినిమా సక్సెస్ అయితే ప్రదీప్ మాస్ దర్శకుడిగా సెటిల్ అయిపోవొచ్చు.