ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కి కరోనా పాజిటీవ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్జున్ సన్నిహితులు తెలిపారు. 2018లోనే ఐశ్వర్య చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఒకటి, కన్నడలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ తమిళ సినిమా సెట్స్‌పై ఉంది. తెలుగులోనూ ఐశ్వర్య ఓ సినిమా చేయబోతోందని అప్పట్లో వార్తలొచ్చాయి. అర్జున్ కూడా కుమార్తెను టాలీవుడ్ లో దింపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేం సత్పలితాలను తీసుకురాలేదు. ఐశ్వర్యకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో అర్జున్, కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సివుంది.