ఏఆర్ఎం రివ్యూ: దీపం దొంగ ఎవరు?

ARM Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 2.5/5

-అన్వర్-

ప్రేక్షకులు చందమామ కథలల్ని తెరపై చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విజువల్ ఫీస్ట్ ఇవ్వదగ్గ కంటెంట్ వుండే కథలివి. దీంతో పిరియాడిక్ యాక్షన్ అడ్వంచర్స్‌ కథలకు మంచి రోజులొచ్చాయి. అనగనగా ఒక రాజు.. అని మొదలయ్యే ఈ త‌ర‌హా కథలు జనాల్నివ‌ థియేటర్ల‌కు రప్పిస్తున్నాయి. మిన్నల్ మురళి, 2018 చిత్రాలతో ఆకట్టుకున్న హీరో టోవినో థామస్.. పాన్ ఇండియా రేంజ్ లో ఓ పిరియాడిక్ ఫాంటసీ అడ్వంచర్ సినిమా చేశాడు. అదే.. ‘ఏఆర్ఎం'(అజాయంతే రందం మోషణం). అజయ్ చేసిన రెండో దొంగతనం అని ఈ టైటిల్ అర్ధం. ఇంతకీ అజయ్ చేసిన ఆ దొంగతనం ఏమిటి? మూడు కాలాలలో సాగే ఈ కథ ప్రేక్షకుల ఎలాంటి అనుభూతిని పంచింది?

అది1990. కేరళలోని కడక్కల్ ప్రాంతం. అజయ్ (టోవినో థామస్) ఊర్లో చిన్న చిన్న ఎలక్ట్రిక్ పనులు చేస్తుంటాడు. అదే ఊర్లో జమీందారు కూతురు లక్ష్మీ (కృతి శెట్టి)తో ప్రేమలో ప‌డ‌తాడు. అజయ్ తాత మణియన్ (టోవినో థామస్ డబుల్ యాక్షన్) ఓ గజదొంగ. కాళ్ళ కి గజ్జలు కట్టుకొని మరీ దొంగతనం చేయడం అతడి స్పెషాలిటీ. మణియన్ పోయినప్పటికీ ‘దొంగ’ అనే ముద్ర అజయ్ ని వెంటాడుతుంది. ఊర్లో ఏ దొంగతనం జరిగినా ఆ నింద అజయ్ మోయాల్సివస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఊరి గుడిలో చాలా చరిత్ర కలిగిన పురాతన దీపాన్ని దొంగలిస్తాడు హరీష్ ఉత్తమన్. తీరా చూస్తే అది నకిలీ దీపమని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఆసలు ఆ దీపం చరిత్ర ఏమిటి? ఒరిజినల్ దీపం ఎక్కడుంది? ఆ దీపానికి అజయ్ కి వున్న లింక్ ఏమిటి? హరీష్ ఉత్తమన్ ఎవరు? ఈ కథలో కేలు (మరో టోవినో) పాత్ర ఏమిటి? దీపాన్ని వెదకడానికి అజయ్ ఎలాంటి సాహసాలు చేశాడు? చివరికి ఒరిజినల్ దీపం దొరికిందా? లేదా? అనేది మిగతా కథ.

ముందు చెప్పుకున్నట్లు ఇదో చందమామ క‌థ‌ లాంటి సినిమా. అనగనగా ఓ రాజు, ఓ మహావీరుడు, మరో గజదొంగ.. అని ఓ పాపకు అమ్మమ్మ చెప్పే కథగా.. కథనం మొదలౌతోంది. నక్షత్రం, దాని శకలాలతో రాజు తయారు చేసిన దీపం, ఆ దీపాన్ని బహుమతిగా పొందిన కేలు.. గజదొంగ మణియన్.. ఇలా ఎపిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని, కొత్త త‌రహా సినిమా చూస్తున్నామ‌న్న న‌మ్మ‌కాన్ని ఇస్తాయి. కథ ల్యాండింగ్ బావున్నప్పటికీ 90నేపధ్యంలో మొదలయ్యే అజయ్ కథ.. కథనంలోని వేగాన్ని తగ్గించేస్తుంది. అక్కడి నుంచి సన్నివేశాలు సాగదీతగా వుంటాయి. అజయ్, లక్ష్మీ ప్రేమ కథ ప్రేక్షకులుని హత్తుకునేలా వుండదు. కథనంలోకి అది సింక్ అవ్వలేదు.

ఎప్పుడైతే గుడిలో దీపాన్ని హరీష్ ఉత్తమన్ దొంగలించి అది నకిలీదని తెలుసుకుంటాడో మళ్ళీ జోష్ వస్తుంది. ఆ నేపధ్యంలో వచ్చే మణియన్ కథ, అతని బ్యాక్ స్టొరీని గ్రిప్పింగ్ గా తీశారు, ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే నిధి వేట సన్నివేశాలు గతంలో చూసిన ట్రెజర్ హంట్స్ ని గుర్తుకు తెచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని లీనం చేసే విజువల్స్ చూపించగలిగాడు దర్శకుడు. మణియన్ ట్రాక్ అంతా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ లా ఆ పాత్రని ముగించిన తీరు బావుంది.

అయితే మణియన్ కథపై పెట్టినంత ద్రుష్టి మిగతా పాత్రలపై పెట్టలేదు. సెకండ్ హాఫ్ లో అజయ్ పాత్ర నడిచిన తీరు సాగదీతగా వుంటుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కువైపోతాయి. అజయ్ లక్ష్యానికి ఆడియన్ కి కనెక్షన్ వుండదు. ప్రీ క్లైమాక్స్ అయితే మరీ డ్రాగ్ చేశారు. కళరి ఫైట్ కిక్ ఇవ్వకపోగా ఎందుకింత లాగుతున్నారనే ఫీలింగ్ కలిగిస్తుంది. మణియన్, అజయ్ క్యారెక్టర్ ఆర్క్స్ ని ఒక్కచోట చేర్చిన క్లైమాక్స్ బావుంది. అయితే కథ ముగింపులో ఒక లోపం కనిపిస్తుంది. హీరో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తన చుట్టూ వున్న పాత్రల్లో కానీ చూస్తున్న ప్రేక్షకుల్లో కానీ ఎదో ఒక ఇంపాక్ట్ వుండాలి. ఈ క్లైమాక్స్ లాంటి ఇంపాక్ట్ ని కలిగించదు.

టోవినో థామస్ మంచి నటుడు. ఏ పాత్రనైనా సహజంగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ తనకి ట్రిపుల్ యాక్షన్ చేసే అవకాశం ఇచ్చింది. ఈ మూడు పాత్రల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా మణియన్ పాత్రని భలే చేశాడు. ఆ పాత్రని చూసి తర్వాత ఈ సినిమాకు మణియన్ అని పేరుపెట్టాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. అంతలా కుదిరిందా క్యారెక్టర్. కేలు పాత్ర చిన్నదే అయినా ఈ కథ మూలం ఆ ట్రాకే. అజయ్ పాత్రని ఇంకాస్త చలాకీగా తీర్చిదిద్దాల్సింది. కృతిశెట్టి అందంగా కనిపించింది. ఐతే ప్రేమకథలో బలం లేదు. ఐశ్వర రాజేష్ పాత్ర చిన్నదే. సురభి చెప్పుకొదగ్గ నటన కనబరిచింది. మణియన్ క్యారెక్టర్ కి డ్రైవింగ్ ఫోర్స్ ఆమె. హరీష్ ఉత్తమన్ ది డీసెంట్ విలన్ రోల్. ఫ్రెండ్ క్యారెక్టర్ బాసిల్ మెరిశాడు. మిగతానటులు కథకు తగట్టుగా కనిపించారు.

టెక్నికల్ గా సినిమాకి మంచి మార్కులు పడతాయి. కొన్ని సీన్స్ ని ఎక్స్ క్లూజీవ్ గా త్రీడీ కోసం చేశారు. అవి ఆ ఫార్మెట్ లో చూస్తేనే ఇంపాక్ట్ వుంటుంది. దిభు థామస్ నేపధ్య సంగీతంలో కొన్ని మెరుపులు వున్నాయి. చాలా సీన్స్ ని ఎలివేట్ చేశాడు. జాన్ ఇచ్చిన విజువల్స్ లో మంచి క్యాలిటీ వుంది. ఎడిటర్ పదునుపెట్టాల్సిన సన్నివేశాలు కొన్ని వున్నాయి. గ్రాఫిక్స్ మరీ అద్భుతం అని చెప్పడం కాదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా చేశారు. మూడు కాలాల్లో జరిగే ఈ కథలో మంచి ఆర్ట్ వర్క్ ని చూడొచ్చు.

తెలుగు360 రేటింగ్: 2.5/5

-అన్వర్-

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇండస్ట్రీ #MeToo : నాణేనికి మరో వైపు లేదా !?

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా మహిళా ఆర్టిస్ట్ లేదా టెక్నిషియన్ ఫలానా వారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తే ప్రపంచం బద్దలైపోయినంత ప్రచారం వస్తుంది. అది సినీ ఇండస్ట్రీకి ప్రజల్లో ఉన్న...

పిలవండి..వచ్చేస్తాం.. గులాబీల సందేశం!?

పార్టీ మారాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారా? అధికార పార్టీలో ప్రాధాన్యత దక్కాలంటే ఇంతకంటే మంచి సమయం దొరకదని లెక్కలు కడుతున్నారా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాలతో...

వెట్రిమార‌న్‌తో సినిమా చేయాల‌ని ఉంది: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మ‌న‌సులో మాత్రం.. ఓ దర్శ‌కుడు ప్ర‌త్యేక స్థానాన్ని ఆక్ర‌మించుకొన్నాడు. త‌న‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ ఆస‌క్తి చూపిస్తున్నాడు....

సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క...

HOT NEWS

css.php
[X] Close
[X] Close