ఏపీలో ప్రభుత్వానికి ఎన్నికలు దగ్గర పడుతన్న కొద్దీ ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. బకాయిలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నాారు. అడుగుతున్న వారిని బెదిరిస్తున్నారు. ఎన్నికల వరకూ అడగకుండా ఉండటానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల విషయంలో నూ అదే చేస్తున్నారు. పన్నెండువందల కోట్ల బ కాయిలు ఉంటే.. మూడు వందల కోట్లు ఇస్తామని… సర్దుకోవాలని అంటున్నారు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అని బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం … బెట్టుగా ఉంటున్నాయి. తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే ఇరవై ఏడో తేదీ నుంచి సర్వీసులు నిలిపివేస్తామని ప్రకటించాయి. గడువు రెండు రోజులుక రావడంతో… ఇప్పుడు చర్చల పేరుతో హడావుడిగా ఆస్పత్రుల యాజమాన్యాలను పిలుస్తున్నారు. గతంలోనూ ఇంతే. బకాయిలు అడుగుతున్నారని ఆస్పత్రుల మీద ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేయించారు. చివరికి ఎంతో కొంత తీసుకుని… సర్వీసులు అందిస్తామని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పని చేయక తప్పదేమో అని చెబుతున్నారు.
ప్రభుత్వం ఎవరికీ బిల్లులు చెల్లించడం లేదు. పీకల మీదకు వస్తే సర్వీసులు ఆపేస్తామని చెబితే ప్రత్యామ్నాయం ఉంటే .. వారికి బిల్లులు ఆపేసి వేరే వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోతే.. తృణమో.. పణమో పడేసి.. సర్వీసులు కొనసాగించాలని అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకూ అదే పరిస్థితి కనిపిస్తోంది.